For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన సాల్ట్: గంగూలీ రికార్డు బ్రేక్

ఈడెనె గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మది వికెట్లకు 153 పరుగులు చేసింది. కుల్‌దీప్ యాదవ్ (35; 26 బంతుల్లో, 5x4, 1x6), రిషభ్ పంత్ (27; 20 బంతుల్లో, 2x4, 1x6) టాప్ స్కోరర్లు.

వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లుతో (3/16)తో సత్తాచాటాడు. హర్షిత్ రాణా (2/28), వైభవ్ అరోరా (2/29) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు వచ్చిన కేకేఆర్ 16.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు. ఫిల్ సాల్ట్ (68; 33 బంతుల్లో, 7x4, 5x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ (33*; 23 బంతుల్లో, 3x4, 1x6), వెంకటేశ్ అయ్యర్ (26*; 23 బంతుల్లో, 2x4, 1x6) జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

Phil Salt Breaks Ganguly s Record Most Runs at Eden Gardens in an IPL Season

ఆది నుంచే దూకుడుగా ఆడి మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా మార్చిన ఫిల్ సాల్ట్ అరుదైన రికార్డు సాధించాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన సాల్ట్ 344 రన్స్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. 2010 సీజన్‌లో కేకేఆర్ సొంతమైదానంలో దాదా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 331 పరుగులు చేశాడు.

ఈడెనె గార్డెన్స్ వేదికగా ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సాల్ట్, గంగూలీ తర్వాతి స్థానాల్లో రసెల్, క్రిస్ లిన్ ఉన్నారు. ఐపీఎల్-2019 సీజన్‌లో రసెల్ ఏడు ఇన్నింగ్స్‌ల్లో 311 పరుగులు చేశాడు. ఐపీఎల్-2018 సీజన్‌లో క్రిస్ లిన్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 303 పరుగులు సాధించాడు. కాగా, ఈ సీజన్‌లో కేకేఆర్ ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటుతోంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ అవకాశాలను క్రమంగా మెరుగుపర్చుకుంటుంది.

Story first published: Tuesday, April 30, 2024, 8:00 [IST]
Other articles published on Apr 30, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+