న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అదే బౌలర్ మళ్లీ: ఫిల్ హ్యూస్ మరణాన్ని గుర్తుకు తెచ్చిన బౌన్సర్

By Nageshwara Rao
Phil Hughes reminder: Bouncer fells Victoria batsman Will Pucovski during Sheffield Shield

హైదరాబాద్: మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణం అభిమానులకు ఇప్పటికీ గుర్తే. 2014 నవంబర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ వేసిన బౌన్సర్ హ్యూస్ తలను బలంగా తాకింది. బంతి తగిలిన వెంటనే హ్యూస్ క్రీజులో కుప్పకూలిపోయాడు.

వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటీకీ ప్రయోజనం లేకపోయింది. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన హ్యూస్ చివరకు తుదిశ్వాస విడిచాడు. తాజాగా ఆదివారం (మార్చి 4)న అదే బౌలర్ విసిరిన బంతి మరో క్రికెటర్‌ విల్‌ పీవుకోవ్‌స్కీను తీవ్రంగా గాయపరచడం ఉలిక్కిపడేలా చేసింది.

వివరాల్లోకి వెళితే... ఆసీస్‌ దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ఆదివారం షెఫల్‌ షీల్డ్‌ టోర్నీలో భాగంగా న్యూసౌత్‌ వేల్స్‌-విక్టోరియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో న్యూసౌత్‌ వేల్స్‌ తరపున ఆడుతున్న సీన్‌ అబాట్‌ వేసిన బంతి విక్టోరియా ఆటగాడు విల్‌ పీవుకోవ్‌స్కీ తలకు బలంగా తాకింది.

బంతి తగిలిన మరుక్షణమే పీవుకోవ్‌స్కీ మైదానంలో కుప్పకూలిపోయాడు. దాంతో అక్కడ ఉన్న ఆటగాళ్లంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే విక్టోరియా జట్టుకు సంబంధించిన ఫిజియో, మెడికల్‌ స్టాఫ్‌ గ్రౌండ్‌లోకి పరుగులు తీశారు. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించడంతో తేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అతని తలకు స్కానింగ్‌ చేసిన తర్వాత పెద్ద గాయం కాలేదని తేలడంతో ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో చోటు చేసుకుంది. విక్టోరియా జట్టు కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వ్యవహారిస్తున్నాడు. విల్‌ పీవుకోవ్‌స్కీ గాయపడిన వెంటనే అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు.

క్రికెట్ విక్టోరియా డాక్టర్ ట్రిఫోర్ జేమ్స్ మాట్లాడుతూ విక్టోరియా మెడికల్ సిబ్బంది ట్రీట్‌మెంట్ ఇచ్చిన తర్వాత కూడా విల్‌ పీవుకోవ్‌స్కీ మైదానంలో కాసేపు మ్యాచ్ చూశాడని పేర్కొన్నారు. అయితే అతడిని ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ నుంచి తప్పించారు. అతడి స్థానంలో విక్టోరియా ఆల్ రౌండర్ డాన్ క్రిస్టియాన్‌కు తుది జట్టులో చోటు కల్పించారు.

20 ఏళ్ల విల్‌ పీవుకోవ్‌స్కీ షెఫల్‌ షీల్డ్‌ టోర్నీలో గత నెలలో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. హ్యూస్‌ మరణానికి కారణమైన బౌలరే మరొకసారి అలాంటి బౌన్సర్‌ తో మరో క్రికెటర్‌ను గాయపరచడం చర‍్చనీయాంశమైంది.

Story first published: Sunday, March 4, 2018, 15:20 [IST]
Other articles published on Mar 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X