న్యూఢిల్లీ: ఆసీస్ క్రికెట్ ఫిల్ హ్యూస్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు నేపథ్యంలో, భారత్ తమకు ఎంతగానో సహకరించిందని క్రికెట్ ఆస్టేలియా పేర్కొంది. షెడ్యూల్ మార్పు విషయంలో భారత జట్టు అందించిన సహాకారం మరువలేదని క్రికెట్ ఆస్ట్రేలియా డైరక్టర్, మాజీ పేస్ బౌలర్ మైకేల్ కాస్ప్రోవిజ్ ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో అన్నారు.
తొలి టెస్టు డిసెంబర్ 4న బ్రిస్ బేన్‌లో జరగాల్సి ఉండగా.. హ్యూస్ మృతితో తాజా షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 9న జరుగుతున్న విషయం తెలిసిందే. నాలుగు టెస్టుల సిరిస్ షెడ్యూల్ మార్చుతున్నట్టు చెప్పగానే, టీమిండియా మేనేజ్ మెంట్ ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా అంగీకరించిందని అన్నారు.
క్రికెట్ ఆస్టేలియా పరిస్ధితిని అర్ధం చేసుకున్నందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. హ్యూస్ అంత్యక్రియలకు రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, డంకన్ ఫ్లెచర్ వచ్చారని, ఆ సందర్భంగా తాను రవిశాస్త్రితో మాట్లాడానని కాస్ప్రోవిజ్ వెల్లడించారు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి టెస్టు సిరీస్ తేదీల మార్పుకు వెంటనే సమ్మతి తెలిపాడని చెప్పారు.

త్వరలో వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో క్రికెట్ ఆడేందుకు ఆస్టేలియాకు టీమిండియాకు అభినందనలు తెలిపారు. 2008లో సిడ్నీలో జరిగిన టెస్టులో పాంటింగ్, హర్భజన్ సింగ్ ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆండ్రూ సైమండ్స్‌ను 'మంకీ' అని హర్భజన్ సంభోదించినట్లు ఆసీస్ బృందం ఫిర్యాదు చేయడంతో మ్యాచ్ రిఫరీ మైక్ ప్రోక్టర్ హర్భజన్‌పై మూడు టెస్టుల నిషేధం విధించారు.
దీంతో టీమిండియా ఆసీస్ సిరిస్‌ను బాయ్ కాట్ చేద్దామనే నిర్ణయం తీసుకోవడవడం... సచిన్ భజ్జీకి సపోర్ట్‌గా సాక్ష్యం చెప్పడంతో కొద్దిపాటి జరిమానా విధించడంతో వివాదం సద్దుమణిగింది. అలాంటి సంఘటనలు కూడా మరచి టీమిండియా, క్రికెట్ ఆస్టేలియాకు సహకరించిందన్నారు.
ఇక, ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా తొలి టెస్టును ఆడడం ద్వారా 'హ్యూస్ పేజీ'ని తిప్పేస్తారని భావిస్తున్నామని అన్నారు. హ్యూస్ మరణం అంతర్జాతీయంగా ఎంతో ప్రభావం చూపిందని తెలిపారు. తొలి టెస్టు ఆడడమే హ్యూస్‌కు సరైన నివాళి అన్న కోచ్ డారెన్ లేమన్‌తో తాను ఏకీభవిస్తున్నానని కాస్ప్రోవిజ్ పేర్కొన్నారు.