మార్నస్ లబుషేన్ బ్యాటింగ్.. శునకం కీపింగ్!!

మెల్‌బోర్న్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గడగడలాడిస్తుండడంతో అన్ని క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వీటిలో ఐపీఎల్-2020, వింబుల్డన్, టోక్యో ఒలింపిక్స్ ఇతర క్రీడలు కూడా ఉన్నాయి. క్రీడలన్నీ వాయిదా పడడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆటగాళ్లు తాము ఇంటిలో చేసే ప్రతీ పనిని సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ మర్నస్ లబుషేన్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

పెంపుడు కుక్కతో ప్రాక్టీస్:
మర్నస్ లబుషేన్ లాక్‌డౌన్‌లోనూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు. క్రికెట్ ఆటపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. లబుషేన్ తన పెంపుడు కుక్కతో కలిసి టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన స్నేహితుడు విసురుతున్న బంతులను లబుషేన్ ఎదుర్కొంటుంటే.. అతడి పెంపుడు కుక్క వికెట్ కీపింగ్ బాధ్యతలు మోసింది. వెనకకు వెళ్లిన బంతులను శునకం తీసుకురావడం అందరిని ఆకుట్టుకుంది.

సూపర్ డాగ్:
ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోను మర్నస్ లబుషేన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'ఎప్పటికీ క్రికెట్‌ను ప్రేమిస్తూనే ఉంటాను' అనే వాఖ్య జోడించాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పోస్ట్ చేసిన కొద్ది గంటలోనే ఈ వీడియోకు ఎన్నూ లైకులు వచ్చాయి. మరోవైపు నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'సూపర్ డాగ్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'ఆసీస్ జట్టుకు ఆడొచ్చు ఈ శునకం' అని మరో అభిమాని కామెంట్ చేసాడు.

విజ్డన్ లీడింగ్ క్రికెటర్‌గా లబుషేన్:
విజ్డన్ అత్యత్తుమ ఐదుగురు ప్లేయర్ల జాబితాలో మార్నస్ లబుషేన్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా మార్నస్ లబుషేన్‌ను ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్, టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ ఓ ఆట ఆడుకున్నారు. ర్యాగింగ్ తరహాలో సరదాగా ప్రాంక్ చేసి లబుషేన్‌ను వెర్రోడిని చేశారు. అత్యంత దారుణంగా ఏప్రిల్ ఫూల్ చేశారు. అయితే ఇది ఈ ఏడాది చేసింది కాదు. గతేడాది ఈ వీడియోను రూపోందించగా.. ఆస్ట్రేలియా జట్టుపై డాక్యుమెంటరీ రూపొందించిన అమెజాన్ ప్రైమ్ తాజాగా ఈ ప్రాంక్ వీడియోను విడుదల చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications