For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Big Bash League 2022 విజేత పెర్త్ స్కార్చ‌ర్స్‌! రికార్డు స్థాయిలో నాలుగో సారి..

Perth Scorchers win the Big Bash League Trophy for the fourth time

మెల్‌బోర్న్‌: బిగ్‌బాష్ లీగ్ 2022 విజేత‌గా పెర్త్ స్కార్చర్స్ నిలిచింది. బిగ్‌బాష్ లీగ్ 11 ఫైన‌ల్‌లో సిడ్నీ సిక్సర్స్‌పై పెర్త్ స్కార్చ‌ర్స్ ఘ‌న విజ‌యం సాధించింది. త‌ద్వారా బిగ్‌బాష్ ట్రోఫీని పెర్త్ స్కార్చ‌ర్స్ రికార్డు స్థాయిలో నాల్గో సారి కైవ‌సం చేసుకుంది. 3, 4, 6వ సీజ‌న్ల‌లో కూడా పెర్త్ స్కార్చ‌ర్స్ ట్రోఫీని గెలిచింది. పూర్తిగా వ‌న్ సైడేడ్‌గా జ‌రిగిన ఈ ఫైన‌ల్‌ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చ‌ర్స్ అన్ని విభాగాల్లో అద‌ర‌గొట్టింది.

ఆదుకున్న‌ లారీ ఇవాన్స్, ట‌ర్న‌ర్

మొద‌ట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్‌ను సిడ్నీ సిక్స‌ర్స్ బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో 25 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఓపెన‌ర్లు జోష్ ఇంగ్లిస్ 13, పీట‌ర్స‌న్ ఒక్క ప‌రుగుకే వెను దిరిగారు. ఇక మిచెల్ మార్ష్ 5, మున్రో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి విఫ‌ల‌మయ్యారు. ఈ క్ర‌మంలో కెప్టెన్‌ టర్నర్, లారీ ఇవాన్స్ పెర్త్ స్కార్చ‌ర్స్‌ను ఆదుకున్నారు. వీరిద్ద‌రు క‌లిసి ఐదో వికెట్‌కు ఏకంగా 104 ప‌రుగుల సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. జ‌ట్టు స్కోర్ 129 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా కెప్టెన్ ట‌ర్న‌ర్ ఔట‌య్యాడు. మొత్తం 35 బంతులు ఎదుర్కొన్న ట‌ర్న‌ర్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌ర్‌తో 54 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాత ఇవాన్స్ మిగ‌తా బ్యాట‌ర్ల‌తో క‌లిసి స్కోర్‌ను ముందుకు న‌డిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి పెర్త్ స్కార్చ‌ర్స్ 171 ప‌రుగులు చేసింది. 41 బంతుల్లోనే 76 ప‌రుగులు చేసి ఇవాన్స్ అజేయంగా నిలిచాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. స్టీవ్, లియోన్ రెండేసి, బ‌ర్డ్, హైడేన్ త‌లో వికెట్ తీశారు.

చేత్తులెత్తేసిన సిడ్నీ

ఇక 172 ప‌రుగుల ట‌ఫ్ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సిడ్నీ సిక్స‌ర్స్ ఏ ద‌శ‌లోనూ గెలిచేలా క‌నిపించ‌లేదు. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో డేనియల్ హ్యూస్(42) మిన‌హా మిగ‌తా వారంతా చేతులెత్తేశారు. పెర్త్ స్కార్చ‌ర్స్ బౌల‌ర్ల ధాటికి సిడ్నీ సిక్స‌ర్స్‌ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతూ వ‌చ్చింది. ఎక్క‌డా కూడా ల‌క్ష్యాన్ని చేధించే దిశ‌గా ప‌య‌నించ‌లేదు. ఓపెన‌ర్లు హేడెన్ కెర్ 2, నికోలస్ బెర్టస్ 15 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. డేనియల్ హ్యూస్ ఒక్క‌డే 42 ప‌రుగుల‌తో రాణించాడు. కెప్టెన్ మోయిసెస్ హెన్రిక్స్ 7 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. డేనియల్ క్రిస్టియన్ 3, జస్టిన్ అవెండానో 1, అబ్బాట్ 1, వికెట్ కీప‌ర్ జాయ్ లింట‌న్ 10 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. దీంతో సిడ్నీ సిక్స‌ర్స్ ల‌క్ష్యాన్ని చేధించ‌లేక 16.2 ఓవ‌ర్ల‌లో 92 ప‌రుగుల‌కే ఆలౌటై ఘోర ప‌రాజ‌యం పాలైంది. దీంతో 79 ప‌రుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించి పెర్త్ స్కార్చ‌ర్స్ నాలుగో సారి బిగ్‌బాష్ లీగ్ ట్రోఫీని ఎగురేసుకు పోయింది. పెర్త్ బౌల‌ర్ల‌లో టై 3, రిచ‌ర్డ్స‌న్ 2, ట‌ర్న‌ర్, పీట‌ర్, అగ‌ర్‌, జేస‌న్ త‌లో వికెట్ తీశారు.

Usman Khawaja 'Undresses' During BBL Game, Leaves Fans in Disbelief

నాలుగో సారి

బిగ్‌బాష్ ట్రోఫీ గెల‌వ‌డం పెర్త్ స్కార్చ‌ర్స్‌కు ఇది నాలుగో సారి. గ‌తంలో 3, 4, 6వ సీజ‌న్ల‌లో కూడా ఆ జ‌ట్టు విజేత‌గా నిలిచింది. కాగా ఫైన‌ల్ మ్యాచ్‌లో 76 ప‌రుగుల‌తో చెల‌రేగిన లారీ ఇవాన్స్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు బెన్ మెక్‌డెర్మోట్‌కు ద‌క్కింది.

Story first published: Friday, January 28, 2022, 18:51 [IST]
Other articles published on Jan 28, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+