క్రిస్ జోర్డాన్ కళ్లుచెదిరే క్యాచ్.. షాక్‌కు గురైన క్రిస్టియాన్ (వీడియో)!!

మెల్‌బోర్న్: ఇటీవలే ప్రారంభం అయిన బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచుతుంది. లీగ్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించగా.. అఫ్గాన్ స్పిన్నర్ అహ్మద్ వినూత్న సంబరాలతో అబిమానులను అలరించాడు. తాజాగా ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో హాట్‌టాపిక్‌గా మారాడు.

స్టన్నింగ్ క్యాచ్:
బీబీఎల్‌లో భాగంగా మెల్‌బోర్న్ రెనిగేడ్స్-పెర్త్ స్కాచర్స్‌ల మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. పెర్త్ స్కార్చర్స్ తరఫున క్రిస్ జోర్డాన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫవాద్ అహ్మద్ వేసిన 18వ ఓవర్‌లో మెల్‌బోర్న్ ఆటగాడు క్రిస్టియన్.. లాంగాన్ వైపు భారీ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జోర్డాన్.. గాల్లోకి అమాంతం ఎగిరి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన క్రిస్టియాన్ ఖాతా తెరవకుముందే పెవిలియన్‌కు చేరాడు.

నెట్టింట్లో వైరల్:
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ, బీబీఎల్ తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేశాయి. దీంతో ఈ స్టన్నింగ్ క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ.. లీకులు కొడుతున్నారు. 'జోర్డాన్ స్టన్నింగ్ క్యాచ్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'వాట్ ఏ క్యాచ్' అని మరో అభిమాని ట్వీటాడు.

పంజాబ్‌కు జోర్డాన్:
తాజాగా ముగిసిన ఐపీఎల్ వేలంలో క్రిస్ జోర్డాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంచైజీ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌కు జోర్డాన్ రూపంలో బౌలర్‌తో పాటు మంచి ఫీల్డర్ కూడా దొరికాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 'పంజాబ్ జట్టును గెలిపించడానికి జోర్డాన్ వస్తున్నాడు' అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
పెర్త్ స్కాచర్స్ విజయం:
తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెమెరాన్ (51), మిచెల్ మార్ష్ (56) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం బరిలోకి మెల్‌బోర్న్ ఆరు వికెట్లు కోల్పోయి 185 పరుగులే చేసి ఓడింది. షాన్ మార్ష్ (55), వెబ్‌స్టర్ (67) రాణించారు. పెర్త్ బౌలర్లో జోర్డన్, అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications