టాప్ 5 క్రికెటర్లు వీరే: ఇంగ్లాండ్‌పై పేలవంగా కోహ్లీ రికార్డు
రాజ్‌కోట్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో తొలి టెస్టు బుధవారం (నవంబర్ 9)న ప్రారంభమైంది. వెస్టిండిస్, న్యూజిలాండ్ జట్లపై వరుస విజయాలతో టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్న టీమిండియా ఇంగ్లాండ్‌పై అదే జోరుని కొనసాగించనుంది.
ఇరు జట్లకు చెందిన అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు సైతం ఆతిథ్య జట్టుపై టీమిండియా విజయం సాధిస్తుందనే చెబుతుండటం విశేషం. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అద్భుతమైన ఫామ్‌లో ఉండటమే ఇందుకు నిదర్శమని అంటున్నారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఎక్కువ మంది సీనియర్ ఆటగాళ్లు ఉండటంతో పాటు ఇంగ్లాండ్‌తో కాస్తో, కూస్తో ఆడిన అనుభవం కూడా ఉండటం జట్టుకు కలిసొస్తుందని అంటున్నారు. అంతేకాదు ఈ సిరిస్ స్వదేశంలో జరుగుతుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం.
టీమిండియాలో ఒక్క ఛటేశ్వర పుజారా మినహాయించి మిగతా సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌పై గతంలో మంచి పరుగులే సాధించారు. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ జట్టుపై తన బ్యాటింగ్‌ను మెరుగు పరచుకునేందుక ఇదొక చక్కని అవకాశం.
ఇంగ్లాండ్ జట్టుపై అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదుగురు అత్యుత్తమ భారత బ్యాట్స్‌మెన్లు వీరే:

విరాట్ కోహ్లీ టెస్టు ప్రదర్శన (మొత్తం):
మ్యాచ్‌లు: 48, 82 innings
పరుగులు: 3,554
సెంచరీలు: 13,
అర్ధసెంచరీలు: 12
అత్యధిక స్కోరు: 211
యావరేజి: 45.56
ఇంగ్లాండ్ జట్టుపై విరాట్ కోహ్లీ ప్రదర్శన:
మ్యాచ్‌లు: 9; 17 innings
పరుగులు: 322
సెంచరీ: 1,
అర్ధసెంచరీ: 0
అత్యధిక స్కోరు: 103
యావరేజి: 20.12

గంభీర్ టెస్టు ప్రదర్శన (మొత్తం):
మ్యాచ్‌లు: 57, 102 innings
పరుగులు: 4,125
సెంచరీలు: 9;
అర్ధసెంచరీలు: 22
అత్యధిక స్కోరు: 206
యావరేజి: 42.52
ఇంగ్లాండ్ జట్టుపై గంభీర్ ప్రదర్శన:
మ్యాచ్‌లు: 11, 20 innings
పరుగులు: 739
సెంచరీ: 1,
అర్ధసెంచరీలు: 4
అత్యధిక స్కోరు: 179
యావరేజి: 36.95

మురళీ విజయ్ టెస్టు ప్రదర్శన (మొత్తం):
మ్యాచ్‌లు: 42, 72 innings
పరుగులు: 2,823
సెంచరీలు: 6,
అర్ధ సెంచరీలు: 14
అత్యధిక స్కోరు: 167
యావరేజి: 39.76
ఇంగ్లాండ్ జట్టుపై మురళీ విజయ్ ప్రదర్శన:
మ్యాచ్‌లు: 5, 10 innings
పరుగులు: 402
సెంచరీలు: 1,
అర్ధ సెంచరీలు: 2
అత్యధిక స్కోరు: 146
యావరేజి: 40.20

అజ్యంకె రహానే టెస్టు ప్రదర్శన (మొత్తం):
మ్యాచ్‌లు: 29, 50 innings
పరుగులు: 2,209
సెంచరీలు: 8,
అర్ధ సెంచరీలు: 9
అత్యధిక స్కోరు: 188
యావరేజి: 51.37
ఇంగ్లాండ్ జట్టుపై రహానే ప్రదర్శన:
మ్యాచ్‌లు: 5, 10 innings
పరుగులు: 299
సెంచరీలు: 1,
అర్దసెంచరీలు: 2
అత్యధిక స్కోరు: 103
యావరేజి: 33.22

ఛటేశ్వర పుజారా టెస్టు ప్రదర్శన (మొత్తం):
మ్యాచ్‌లు: 38, 64 innings
పరుగులు: 2,855
సెంచరీలు: 8,
అర్ధ సెంచరీలు: 10
అత్యధిక స్కోరు: 206*
యావరేజి: 49.22
ఇంగ్లాండ్ జట్టుపై ఛటేశ్వర పుజారా ప్రదర్శన:
మ్యాచ్‌లు: 9, 17 innings
పరుగులు: 660
సెంచరీలు: 2,
అర్ధ సెంచరీలు: 1
అత్యధిక స్కోరు: 206*
యావరేజి: 44.00
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications