19 ఏళ్ల క్రితం: ఒకే మ్యాచ్ లో పదికి పది వికెట్లు పడగొట్టిన కుంబ్లే
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఆ రోజు భారత క్రికెట్ చరిత్రలోనే సంచలనం. కేవలం భారత్‌లోనే కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో కుంబ్లేను రెండో వాడిగా నిలిపిన రోజు. అది 1999 ఫిబ్రవరి 7వ తేది. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో భారత జట్టు పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి పాక్ బరిలోకి దిగింది.

ప్రపంచంలోనే రెండో బౌలర్‌గా:
పాక్ బ్యాట్స్‌మెన్‌ను భారత జట్టు ఒకే ఒక్క బౌలర్ శాసించాడు. పదికి 10 వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. ఆయనే భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే. టెస్టు క్రికెట్ చరిత్రలో జిమ్ లేకర్ తరవాత ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. తన రికార్డును చిరకాలం నిలిచిపోయేలా చేశాడు.

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో:
1999 జనవరి నెలలో భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్ జట్టు రెండు టెస్టుల్లో తలపడింది. జనవరి 28 నుంచి 31 వరకు చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 12 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 4న ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల స్టేడియంలో ప్రారంభమైంది.

భారీ లక్యాన్ని ముందుంచిన భారత్:
సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే అనిల్ కుంబ్లే (4 వికెట్లు), హర్భజన్ (3 వికెట్లు) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 172కే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసిన భారత్.. పాక్ ముందు 420 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

పాక్ క్రికెటర్లు రెచ్చిపోయి ఆడటంతో:
రెండో ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 101 పరుగుల వద్ద షాహిద్ అఫ్రిదిని ఔట్ చేసి అనిల్ కుంబ్లే తన దండయాత్రను మొదలుపెట్టాడు.

చరిత్ర సృష్టించిన కుంబ్లే:
వరసపెట్టి వికెట్లు తీస్తూ 207 పరుగులకే పాక్‌ను కుప్పకూల్చాడు. భారత్‌కు 212 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. 10/74 గణాంకాలతో చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్రకు నేటితో 19 ఏళ్లు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications