Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాల్‌ ట్యాంపరింగ్‌ సెగ.. స్మిత్‌ను ఎగతాళి చేసిన వారు క్రికెట్‌ లవర్సే కాదు

Ashes 2109 : 'They'Re Not Cricket Fans' Mitchell Johnson Condemns Booing Of Steve Smith || Oneindia
People who booed Steve Smith, those are not cricket fans says Mitchell Johnson

సిడ్నీ: బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఇప్పటికీ ఇంగ్లండ్‌ అభిమానులు పదే పదే 'చీటర్‌-చీటర్‌' ఎగతాళి చేస్తూనే ఉన్నారు. స్మిత్‌ను ఎగతాళి చేసిన వారు అసలు క్రికెట్‌ లవర్సే కాదు అని ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్సన్‌ పేర్కొన్నారు. బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌.. ప్రపంచకప్‌ ద్వారా సత్తా చాటుకున్నాడు. ఇక యాషెస్‌ సిరీస్‌ ద్వారా తన టెస్టు పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. తొలి టెస్టులో రెండు భారీ సెంచరీలు చేసిన స్మిత్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేసాడు.

బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. యాషెస్‌ తొలి టెస్ట్ నుండే ఇంగ్లండ్‌ అభిమానులు స్మిత్‌పై చీటర్‌-చీటర్‌ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంగ్లాండ్‌ పేసర్ ఆర్చర్ 148 కి.మీ వేగంతో విసిరిన బౌన్సర్‌ స్మిత్‌ తలకి బలంగా తాకడంతో గాయపడి పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో కూడా ఈ తరహా విమర్శలు చేశారు ఇంగ్లీష్ అభిమానులు. ఈ విమర్శలపై మిచెల్‌ జాన్సన్‌ స్పందించాడు.

'ఇది నన్ను నిజంగా నిరాశపరిచింది. అభిమానులు ఏం అంటున్నారో నేను పట్టించుకోను. అవును స్మిత్ తప్పు చేసాడు. అందుకు శిక్ష కూడా అనుభవించాడు. ఎప్పుడో జరిగిన ఘటనను మళ్లీ మళ్లీ గుర్తు చేయడం ఎంతవరకు న్యాయం. గేమ్‌లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి కొంతమంది ఉంటారు. వారే స్మిత్‌ను ఎగతాళి చేస్తున్నారు. ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారు నా దృష్టిలో క్రికెట్‌ లవర్సే కాదు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన అందరి అభిమానులను ఉద్దేశించి ఇలా అనడం లేదు. మైక్రోఫోన్ ద్వారా ఎగతాళికి సంబందించిన మాటలు వినిపించాయి. ఆ సమయంలో తీవ్ర నిరాశకు గురయ్యా' అని జాన్సన్‌ తెలిపారు.

యాషెస్‌ రెండో టెస్టులో స్మిత్‌ తలకి బలమైన గాయమైంది. ఇంగ్లాండ్‌ పేసర్ ఆర్చర్ 148 కి.మీ వేగంతో విసిరిన బౌన్సర్‌ స్మిత్‌ తలకి బలంగా తగిలింది. దీంతో స్మిత్‌ వెంటనే నేలపై పడిపోయాడు. వెంటనే వైద్య సిబ్బంది అతడికి చికిత్సను అందించాయి. ఆసీస్‌ వైద్యుని సూచనల మేరకు అతడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్మిత్ 80 పరుగులు చేసాడు. సిడిల్‌ ఔటైన అనంతరం తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్‌.. మరో 12 పరుగులు చేసి వోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Story first published: Sunday, August 18, 2019, 19:44 [IST]
Other articles published on Aug 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+