మా ప‌త‌నాన్ని కోరుకుంటున్నారా..బ్ల‌డీ హెల్‌! ఇంగ్లండ్ ఓపెన‌ర్ కౌంట‌ర్ అటాక్‌

లండ‌న్‌: ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో వ‌రుస ఓటముల‌ను ఎదుర్కొంటోంది ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు. స్వ‌దేశంలో, సొంత గ‌డ్డ‌పై ర‌స‌వ‌త్త‌రంగా మ్యాచ్‌లు కొన‌సాగుతున్న త‌రుణంలో ఆ జట్టు ఆశించిన స్థాయిలో ఆడ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టిదాకా ఆడిన ఏడు మ్యాచుల్లో మూడింట్లో దారుణ ప‌రాజ‌యాల‌ను చ‌వి చూసింది ఆతిథ్యం జ‌ట్టు. ఈ నేప‌థ్యంలో- ఇంగ్లండ్ ఆట‌గాళ్లు, జ‌ట్టు ఆట‌తీరును వేలెత్తి చూప‌డం, తాహ‌తుకు మించి ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌హ‌జంగా జ‌రిగేదే. కాక‌పోతే- ఇంగ్లండ్ జ‌ట్టు ఎప్పుడెప్పుడు ఓడిపోతుందా? ఎప్పుడెప్పుడు త‌మ నోటికి ప‌ని చెబుదామా? అన్నంత గ‌డ్డు స్థితిని ఎదుర్కొంటోంది.

కుమార్తె పెదాలను ముద్దాడిన సాక‌ర్ స్టార్‌!

స‌మ‌వుజ్జీల‌తో ఢీ..

స‌మ‌వుజ్జీల‌తో ఢీ..

ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో ఆ దేశ క్రికెట్ జ‌ట్టు తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ప‌డింది. ఓ మంచి విజ‌యాన్ని అందుకుని విమ‌ర్శ‌ల‌కు నోళ్ల‌ను మూయించాల్సిన బాధ్య‌త జ‌ట్టుపై ఉంది. ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఇంగ్లండ్ టీమ్ త‌న త‌దుప‌రి మ్యాచ్‌లో స‌మ‌వుజ్జీగా ఉన్న టీమిండియాను ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్ప‌టికే ఇవాన్ మోర్గాన్ అండ్ టీమ్ ఏడుమ్యాచ్‌ల‌ను ఆడేసింది. అయిన‌ప్ప‌టికీ.. సెమీ ఫైన‌ల్ బెర్త్ ఖాయం కాలేదు. ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే. అందులో ఒక‌టి టీమిండియాతో, మ‌రొక‌టి న్యూజీలాండ్‌తో. ఈ రెండు జ‌ట్ల నుంచీ ప్ర‌మాదం పొంచివుంద‌నే అనుకోవ‌చ్చు.

మోర్గాన్ టీమ్‌పై ఘాటు విమ‌ర్శ‌లు..

మోర్గాన్ టీమ్‌పై ఘాటు విమ‌ర్శ‌లు..

భార‌త్‌తో మ్యాచ్ ఈ ఆదివారం బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో ఆదివారం జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌ను త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది ఇంగ్లీష్ టీమ్‌కు. ఈ నేప‌థ్యంలో- ఇంగ్లండ్ జ‌ట్టు ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై ఆ జ‌ట్టు ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో తీవ్ర అస‌హనాన్ని వ్య‌క్తం చేశారు. త‌మ ప‌త‌నాన్ని కోరుకునేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌త్యేకించి- ఇంగ్లండ్ టీమ్ మాజీ కేప్టెన్ మైకెల్ వాగ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌ను బెయిర్‌స్టో ఘాటుగా తిప్పికొట్టారు.

మేము గెల‌వాల‌ని కోరుకోవ‌ట్లేదా?..

మేము గెల‌వాల‌ని కోరుకోవ‌ట్లేదా?..

శుక్ర‌వారం ఉద‌యం తాను రేడియో వింటుండ‌గా.. మైకెల్ వాగ‌న్ మాట‌లు ప్ర‌సారం అయ్యాయ‌ని, తమ జ‌ట్టు వైఫ‌ల్యాన్ని ఉద్దేశించి, ఆయ‌న అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్యానాలు చేశార‌ని బెయిర్‌స్టో అన్నారు. ఏ జ‌ట్టుకైనా ఉత్థాన‌ప‌త‌నాలు త‌ప్ప‌వ‌ని చెప్పారు. తాము వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయిన‌ప్ప‌టికీ.. తిరిగి పుంజుకోగ‌ల‌మ‌ని, టోర్నీలో చివ‌రిదాకా నిల‌బ‌డ‌తామ‌నీ బెయిర్‌స్టో అన్నారు. ప్ర‌జ‌లు ఎవ‌రూ తాము గెల‌వాల‌ని కోరుకుంటున్న‌ట్లు క‌నిపించ‌ట్లేద‌ని, త‌మ ప‌త‌నాన్నే కాంక్షిస్తున్న‌ట్లు ఉన్నార‌ని బెయిర్‌స్టో వాపోయారు. `మ‌రోసారి ఓడిపోతే.. మా పీక‌లపై ఎక్కి కూర్చోవాల‌ని కోరుకుంటున్నారు..` అని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పిచ్‌లు అప్ప‌ట్లా లేవు..

పిచ్‌లు అప్ప‌ట్లా లేవు..

ప్ర‌స్తుతం ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్ కోసం రూపొందించిన పిచ్‌లు కొత్త‌గా అనిపిస్తున్నాయ‌ని బెయిర్ స్టో అన్నారు. గ‌త నాలుగేళ్లుగా తాము ఆడిన పిచ్‌లు ఇవి కావ‌ని ఆయ‌న కుండ‌బద్ద‌లు కొట్టారు. ఏ పిచ్‌ల‌పై ఆడి తాము ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ స్థానానికి ఎదిగామో.. అలాంటివి ఒక్క‌టీ క‌నిపించ‌ట్లేదని చెప్పారు. ఫ్లాట్ పిచ్‌ల‌కు భిన్నంగా ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గానీ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) గానీ ఏ ఒక్క దేశానికో లబ్దిపొందేలా పిచ్‌ల‌ను రూపొందించ‌లేద‌ని అన్నారు. ప్ర‌తి బౌల‌ర్‌, ప్ర‌తి బ్యాట్స్‌మెన్ ల‌బ్ది పొందేలా స‌మాన అవ‌కాశాల‌ను క‌ల్పించార‌ని కితాబిచ్చారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 28, 2019, 16:54 [IST]
Other articles published on Jun 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X