Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారీ నష్టం: బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బెదిరింపులు

హైదరాబాద్: బీసీసీఐపై పీసీబీ బెదిరింపులకు పాల్పడుతోంది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడం వల్ల కలిగిన భారీ నష్టాన్ని పూడ్చుకునేందుకు పరిహారం చెల్లించాలని దావా వేసేందుకు సిద్ధమైనట్లు పాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

ప్రస్తుతం దుబాయిలో ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ఇదే విషయాన్ని బీసీసీఐ ప్రతినిధులకు తెలియజేసినట్లు పీసీబీ ఛైర్మన్‌ నజమ్‌ సేథీ ట్వీట్‌ చేశారు.

'2014లో కుదిరిన ఒప్పందం ప్రకారం ద్వైపాక్షిక సిరీసులు ఆడేందుకు వ్యతిరేకిస్తున్నందుకు దావా వేస్తున్నట్లు బీసీసీఐకి పీసీబీ తెలిపింది' అని ఆయన అందులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే 2014లో జరిగిన ఐసీసీ సమావేశాల సందర్భంగా సేథీ ఆధ్వర్యంలోనే ద్వైపాక్షిక సిరీసులు ఆడేందుకు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది.

PCB threatens to sue BCCI over huge financial losses

ఈ ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2023 మధ్యలో భారత్‌ ఆరు ద్వైపాకిక్ష సిరీసులు ఆడాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా పాకిస్థాన్‌తో ఈ సిరీస్‌లు ఆడేది లేదని బీసీసీఐ గతంలో పలుమార్లు తేల్చి చెప్పింది.

దీంతో భారత వ్యతిరేకతతో దాదాపు రూ.1200 కోట్లు (200 మిలియన్‌ డాలర్లు) నష్టం వచ్చినట్లు పీసీబీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఐసీసీలో ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ బీసీసీఐకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో పీసీబీ కూడా ఇలా బెదిరింపులకు దిగడం ఆసక్తికరంగా మారింది.

2007లో జరిగిన ముంబై పేలుళ్ల ఘటన అనంతరం పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీసులు ఆడటం లేదు. అయితే గతేడాది తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ముందుకొచ్చిన కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో బీసీసీఐ అందుకు అనుమతించలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: PCB threatens to sue BCCI
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+