Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CT 2025: 'ఛీ.. 30 నిమిషాలు హ్యాండిల్ చేయలేరా?!' - పీసీబీపై గుర్రుగా ఫ్యాన్స్

ఛాంపియన్స్ ట్రోఫీకి వర్షం బెడద ఎక్కువైంది. వరుణిడి దెబ్బకు ఫలితాలు తారుమారైపోతున్నాయి. తాజాగా గ్రూప్ బీలో ఆస్ట్రేలియా - అఫ్ఘాన్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్ రద్దైంది. దీంతో ఆసీస్ సెమీస్ కు.. అప్ఘాన్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి 25న రావల్పిండి వేదికగా జరగాల్సిన ఆసీస్‌ - దక్షిణాఫ్రికా మ్యాచ్, ఫిబ్రవరి 27 రావల్పిండిలో వేదికగా పాక్‌, బంగ్లా మధ్య మ్యాచ్ టాస్‌ పడకుండా రద్దై పోయాయి.

తీవ్రంగా విమర్శలు..
ఈ వర్షం ఎఫెక్ట్ పాక్ జట్టుపై కూడా చూపించింది. చెత్త ప్రదర్శనతో పాటు ఈ వర్షం వల్ల టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండా పాక్ బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు క్రికెట్ అభిమానులు, మాజీలు.. పాక్ క్రికెట్ బోర్డుపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

PCB Slammed For Poor Drainage At Stadium After rain Washout AUS vs AFG match champions trophy 2025

మండిపడుతోన్న ఫ్యాన్స్..
ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశం వచ్చిన వినియోగించుకోలేకపోయింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి కరాచీ, లాహోర్‌, రావల్పిండి స్టేడియాలను రెనోవేషన్ చేయించినా అవి నిరూపయోగం అయిపోతున్నాయి. కొద్ది పాటి వర్షానికే నీరు ఔట్‌ఫీల్డ్‌లో చేరిపోవడం, పైగా తడిచిన మైదానాన్ని వెంటనే ఆటకు అనువుగా మార్చే సౌకర్యాలు లేకపోవడంతో అందరూ పీసీబీపై మండిపడుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్స్ చేస్తున్నారు. భవిష్యత్ లో పాకిస్థాన్ కు ఎలాంటి ఐసీసీ హోస్టింగ్ రైట్స్ ఇవ్వకూడదని అంటున్నారు. 30 నిమిషాల వర్షాన్ని హ్యాండిల్ చేయలేరా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా, గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీస్ కు అర్హత సాధించాయి. గ్రూప్ బీ భవితవ్యం మార్చి 1న తేలనుంది.

Story first published: Saturday, March 1, 2025, 12:41 [IST]
Other articles published on Mar 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+