'మాకు రూ.447 కోట్లు ఇవ్వాల్సిందే'

న్యూ ఢిల్లీ: గతంలో ద్వైపాక్షిక సిరీస్ ఆడతామని మాటిచ్చి తప్పిన విషయంలో పాక్ వివాదానికి తెరలేపింది. చేయి దాటిపోయిందంటూ పాక్ వివాదాన్ని ఐసీసీ వరకూ తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సుమారు రూ.447 కోట్ల నష్ట పరిహారాన్ని డిమాండ్ చేసింది. ద్వైపాక్షిక క్రికెట్‌కు భారత్ దూరం కావడం వల్ల తాము ఆ నష్టాన్ని చవిచూసినట్లు పీసీబో పేర్కొంది. ద్వైపాక్షిక సిరీస్ కోసం రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.

నిబంధనను ఉల్లంఘించిందంటూ పీసీబీ
కానీ, దేశ రాజకీయాల దృష్ట్యా బీసీసీఐ ఆ సిరీస్‌ను పక్కకు పెట్టేసింది. ఈ క్రమంలో నిబంధనను ఉల్లంఘించిందంటూ పీసీబీ ఆరోపిస్తుంది. అయితే ఈ కేసును అంతర్జాతీయ క్రికెట్ మండలి సమీక్షించనుంది. ఏప్రిల్, 2014లో ద్వైపాక్షిక సిరీస్‌కు ఒప్పందం జరిగింది. అయితే మరో మూడు రోజుల పాటు ఈ కేసులో విచారణలు జరగనున్నాయి. 2015 నుంచి 2023 వరకు ఆరుసార్లు రెండు దేశాల మధ్య టోర్నీలు జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ నిరాకరించడం వల్ల పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ జరగడం లేదు.

పీసీబీకి ఒక్కపైసా చెల్లించం
ఈ క్రమంలో భారత్‌కు పీసీబీకి ఒక్కపైసా చెల్లించదు. ఏళ్ల తరబడి చాలా దేశాలు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. మ్యాచ్‌లు ఆడలేదు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే చర్యలను పాక్ ఆపితే.. ఆ తర్వాత ఆ దేశంతో క్రికెట్ ఆడే విషయం ఆలోచిస్తాం. ఐసీసీ విచారణకు భారత్ తరఫున అధికారులెవరూ హాజరుకారని అనుకుంటున్నాని ఠాకూర్ తెలిపారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఐసీసీ జోక్యం అవసరం లేదు
'నాకు తెలిసినంత వరకు ఈ వివాదాన్ని పీసీబీ, బీసీసీఐ పరిష్కరించుకుంటే బాగుంటుంది. ఐసీసీ జోక్యం అవసరం లేదు. పాక్‌తో ఆడాలని బీసీసీఐ ఎప్పట్నుంచో భావిస్తోంది. కొన్ని కారణాల వల్ల పాక్‌తో ఆడేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం అవుతోంది. తటస్థ వేదికల విషయానికి వస్తే ఆసియా, ఐసీసీ ట్రోఫీల్లో పాక్‌తో భారత్ తలపడుతూనే ఉంది. పాక్‌కు డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదు' అని శుక్లా అన్నారు.

పాక్ క్రికెటర్ల నోటి దురుసుతనానికి
బీసీసీఐ ఎంత సీరియస్‌గా ఉందో పాక్ దానికి రెట్టింపు స్థాయిలో వివాదాన్ని ఐసీసీ వద్దకు తీసుకెళ్లాలని యత్నిస్తోంది. ఇటీవలి కాలంలో పాక్‌తో తలపడిన భారత్.. రెండు వన్డేలు ఆడిన భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. పాక్ క్రికెటర్ల నోటి దురుసుతనానికి బ్యాట్‌తో సమాధానం చెప్పింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications