Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌లో ఆసియాకప్‌ ఆడాలి.. బీసీసీఐకి పీసీబీ బెదిరింపులు!!

PCB says We will not travel to India for T20 World Cup if they won’t come to Pak for Asia Cup

లాహోర్‌: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మళ్లీ బెదిరింపులకు దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో పాకిస్థాన్‌లో జరిగే ఆసియాకప్‌ టీ20 టోర్నీ భారత్ ఆడాలని హెచ్చరించింది. లేదంటే.. 2021లో భారత్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌కు పాక్ జట్టును పంపించబోమని పీసీబీ అంటోంది. ఈ మేరకు పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ శనివారం పేర్కొన్నాడు.

భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తాం:

భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరిస్తాం:

'పాకిస్తాన్‌లో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత్ పాల్గొనకపోతే.. 2021లో భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో మేం కూడా ఆడేందుకు సిద్ధంగా లేము' అని పీసీబీ సీఈఓ వసీమ్‌ ఖాన్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపాడు. బంగ్లాదేశ్ క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌లో పర్యటిస్తే.. ఆసియా కప్ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తామని వస్తున్న వార్తలను వసీమ్ ఖండించారు. 'ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ మాకు ఆతిథ్య హక్కుల్ని ఇచ్చింది. మేం వాటిని ఎవరికీ ఇవ్వం. ఆ అధికారం మాకు లేదు. 2023-2031 మధ్యలో కనీసం మూడు ఐసీసీ టోర్నీల ఆతిథ్య హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తాం' అని తెలిపారు.

బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు:

బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు:

ఆసియా కప్ నిర్వహించడానికి పాకిస్థాన్ రెండు వేదికలను పరిశీలిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. అయితే పాకిస్తాన్‌లో ఆడాలా, లేదా అనే విషయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భారత్‌- పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీసులు ఆడక చాన్నాళ్లు అవుతోంది. ఉగ్రవాదం నిర్మూలించేంత వరకు ఆ దేశంతో ఆడేందుకు జట్టును అనుమతించబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఐసీసీ టోర్నీల్లో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్నాయి.

లంకేయుల సాహసం:

లంకేయుల సాహసం:

శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లో పదేళ్ల క్రితం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత అక్కడే ఏ దేశమూ పర్యటించలేదు. మళ్లీ 2019లో లంకే జట్టే సాహసం చేసి అక్కడ మ్యాచులు ఆడారు. అయితే బంగ్లా మాత్రం టెస్టులు ఆడేందుకు ఒప్పుకోవట్లేదు. పాక్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌కు పునరుజ్జీవం కల్పించేందుకు పీసీబీ అష్టకష్టాలు పడుతోంది. 2020 సెప్టెంబరులో ఆసియా కప్‌ను పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే.. టీ20 ప్రపంచకప్‌ 2021 భారత్‌లో జరగనుంది.

Story first published: Sunday, January 26, 2020, 11:35 [IST]
Other articles published on Jan 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+