ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 29 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై నిర్వహిస్తోన్న ఐసీసీ టోర్నీలో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక విమర్శలను మూటగట్టుకుంది. అలానే మ్యాచుల నిర్వహణ విషయంలోనూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పీసీబీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అతడిపై వేటు!
పాకిస్థాన్ జట్టు వైట్‌బాల్ కెప్టెన్‌గా ఉన్న మహ్మద్ రిజ్వాన్‌పై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందింది. వన్డేతో పాటు టీ20 కెప్టెన్‌గా అతడిని తప్పించాలని నిర్ణయించుకుందట. రిజ్వాన్ స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను నియమించాలని యోచిస్తోందట. త్వరలో జరగనున్న బోర్డు మీటింగ్‌లో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

అప్పటి నుంచే అతడు కెప్టెన్ గా..
పాకిస్థాన్ త్వరలోనే వైట్ బాల్ సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటను వెళ్లనుంది. ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ తోనే రిజ్వాన్ కు పాక్ టీ20 కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించనున్నారని పాక్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. కాగా, గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న షాదాబ్ ఖాన్.. చివరగా పాక్ తరపున గతేడాది జూన్‌లో ఐర్లాండ్‌పై ఆడాడు.
హెడ్ కోచ్ పై కూడా వేటు..
తాత్కాలిక హెడ్ కోచ్ అకీబ్ జావిద్‌పై కూడా వేటు వేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు పీసీబీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. చూడాలి మరి పీసీసీ ఏం చేస్తుందో.
Pakistan Strike Force camp activity: Players train under an experienced team of coaches led by former 🇵🇰 international Abdul Razzaq 🏏 pic.twitter.com/B1olBBe1qT
— Pakistan Cricket (@TheRealPCB) February 25, 2025