
అనుమానాలు..
ఆయా జట్లన్నీ కూడా ఇక నేరుగా సూపర్ - 12లో అడుగు పెట్టనున్నాయి. ఇందులో తొలి మ్యాచ్ శనివారం షెడ్యూల్ అయింది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. వాతావరణం అనుకూలించే పరిస్థితులు లేవు. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన సిడ్నీలో శనివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఆస్ట్రేలియన్ బ్యూరోో ఆఫ్ మెటరాలజీ అంచనా వేసింది.

వర్షం వల్ల..
భారత్-పాక్ మ్యాచ్‌కు కూడా ఇదే పరిస్థితి తలెత్తవచ్చు. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లనేవి అసాధారణం. టీ20 ప్రపంచకప్, వరల్డ్ కప్, ఆసియా కప్ వంటి మేజర్ టోర్నమెంట్లల్లో మాత్రమే భారత్-పాకిస్తాన్ ఎదురెదురు పడుతుంటాయి. ఈ రెండు జట్ల మధ్య తరచూ మ్యాచ్‌లు జరిగితే బాగుంటుందని భావించే అభిమానులూ లేకపోలేదు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తటస్థ వేదిక మీదనైనా ద్వైపాక్షిక సిరీస్‌లు, ముక్కోణపు ట్రోఫీలను నిర్వహించాలనే వాదనలు ఉన్నాయి.

మళ్లీ వచ్చే సంవత్సరమే..
రెండు నెలల కిందట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022 టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ తలపడ్డాయి. దీనికి క్రికెట్ ప్రేమికుల నుంచి లభించిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మళ్లీ రెండు నెలల వ్యవధిలోనే మరోసారి ఈ రెండు జట్లు ఢీ కొట్టబోతోన్నాయి.. టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ వేదికగా. దీని తరువాత వచ్చే ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్- ఆసియా కప్ 2023లోనే సాధ్యపడుతుంది.

జై షా ప్రకటనతో..
ఆసియా కప్ 2023కి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది పాకిస్తాన్. ఈ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ మరోసారి ఎదురుపడతాయని భావించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. ఆసియా కప్ 2023లో ఆడటానికి పాకిస్తాన్‌కు వెళ్లదలచుకోలేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఈ టోర్నమెంట్‌ను తటస్థ వేదిక మీద నిర్వహించదలిస్తే తప్ప తాము పాల్గొనబోమని పేర్కొన్నారు.

రుత్సాహ పరిచింది..
జై షా చేసిన ఈ ప్రకటనపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ స్పందించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్, బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన ప్రకటన తమను నిరుత్సాహానికి గురి చేసిందని వ్యాఖ్యానించింది. తటస్థ వేదికలపై నిర్వహించే అవకాశం ఉందంటూ జై షా చెప్పడాన్ని తప్పు పట్టింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ లేదా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. బోర్డు సభ్యుల అంగీకారంతోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్- 2023 ఆసియా కప్ టోర్నమెంట్ నిర్వహణను తమకు అప్పగించిందని గుర్తు చేసింది.

చీలిక తెచ్చే ప్రయత్నం..
ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ హోదాలో జై షా.. ఇలా ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడం, తమను సంప్రదించకుండానే తటస్థ వేదిక అంశాన్ని ప్రస్తావించడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో జై షా చీలికను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దీని ప్రభావం- 2023 ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్‌పైనా పడుతుందని హెచ్చరించింది. ఆయా అంశాలన్నింటీనీ చర్చించడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.


Click it and Unblock the Notifications












