సరికొత్త జెర్సీలతో బరిలోకి దిగనున్న పాక్, బంగ్లాదేశ్
ఇదిలా ఉంటే, ఈ టోర్నీ కోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు సరికొత్త జెర్సీలు ధరిస్తున్నాయి. ఈ మేరకు ఆటగాళ్లు తమ కొత్త జెర్సీలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కొత్త జెర్సీలు అభిమానులకు సైతం నచ్చడంతో బాగున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. బంగ్లాదేశ్ జెర్సీపై లైఫ్ బాయ్, పాక్ జెర్సీపై పెప్సీ లోగోలు కనిపిస్తున్నాయి.

బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య తొలి మ్యాచ్
టోర్నీలో భాగంగా శనివారం గ్రూప్-బిలోని బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు కొంత మంది ఆటగాళ్లు ఇప్పటికే దుబాయికి చేరుకుంది. మరికొంత మంది ఆదివారం దుబాయికి బయల్దేరి వెళ్లనున్నారు. టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్, ఆప్ఘనిస్తాన్ జట్లు ఆసియా కప్ టైటిల్ రేసులో ఉన్నాయి.

హాంకాంగ్‌తో భారత్ తొలి మ్యాచ్
గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, హాంకాంగ్ జట్లు ఉండగా, గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్ రౌండ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి. టోర్నీలో భాగంగా హాంకాంగ్ ఆడనున్న అన్ని మ్యాచ్‌లకు కూడా ఐసీసీ అంతర్జాతీయ వన్డే హోదాను కల్పించింది.

సెప్టెంబర్ 19న దుబాయి వేదికగా భారత్-పాక్ మ్యాచ్
గత ఆసియా కప్ టోర్నీని తొలిసారిగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. అయితే, ప్రస్తుతం నిర్వహిస్తోన్న టోర్నీని మాత్రం 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్‌లో నెగ్గిన రెండు జట్లు సెప్టెంబర్ 28న దుబాయి వేదికగా ఫైనల్లో తలపడతాయి. తొలి మ్యాచ్‌లో క్వాలిఫయిర్‌తో తలపడనున్నా టీమిండియా, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో దుబాయి వేదికగా సెప్టెంబర్ 19న తలపడనుంది.


Click it and Unblock the Notifications

