బిస్కట్ ట్రోఫీపై విచారణ మొదలుపెట్టిన పాకిస్తాన్

హైదరాబాద్: పాకిస్థాన్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు ముందు ఆవిష్కరించిన 'బిస్కెట్ ట్రోఫీ'పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గుర్రుగా ఉంది. అవమానకరంగా భావించి విచారణ మొదలుపెట్టింది. మూడు వికెట్లపై బిస్కెట్ ఆకృతిలోని ట్రోఫీ నమూనాపై సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన జోకులు పేలాయి. దీంతో నొచ్చుకున్న పీసీబీ అసలేం జరిగిందో తెలుసుకోవడానికి విచారణ మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో పీసీబీ మార్కెటింగ్ చీఫ్ నలియా భాటి రాజీనామా చేశారు.

సిరీస్‌కు ముందు రెండు జట్ల కెప్టెన్‌లు
దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. సిరీస్‌కు ముందు రెండు జట్ల కెప్టెన్‌లు ట్రోఫీని ఆవిష్కరించారు. మూడు వికెట్లపై పెద్ద బిస్కెట్ నమూనాలో ట్రోఫీ ఉంది. దీంతో సోషల్ మీడియాలో వ్యంగ్య బాణాలు మొదలయ్యాయి. ఐసీసీ సైతం ఛాంపియన్స్ ట్రోఫీ నమూనాతో దాన్ని పోలిస్తూ ట్వీట్ చేసి మరింత ఆజ్యం పోసింది.

మార్కెటింగ్ విభాగాన్ని ప్రక్షాళన
‘బిస్కెట్ ట్రోఫీ నమూనా మాకు ఇబ్బందికరంగా అనిపించింది. సంబంధిత శాఖ దీన్నెలా అనుమతించిందో తెలుసుకోవాలని విచారణ ఆరంభించాం. పనిలో పనిగా మార్కెటింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేయనున్నాం' అని పీసీబీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

బిస్కెట్ మాదిరి రూపాన్ని
సాధారణంగా ట్రోఫీలను బంతి, బ్యాట్, వికెట్ల ఆకారంలో రూపొందిస్తుంటారు. అయితే పాక్-ఆసీస్ టీ20 ట్రోఫీలో బిస్కెట్ మాదిరి రూపాన్ని చేర్చారు. ఓ బంతి, మూడు వికెట్లు.. దానిపై భాగంలో బిస్కెట్ రూపంతో ఉన్న ఈ ట్రోఫీపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

బిస్కెట్‌ను ఇవ్వడం, తీసుకోవడంలో కొత్త అర్థం
ఈ ట్రోఫీ బిస్కెట్ రూపంలో ఉండటంతో ఐసీసీ కూడా స్పందించింది. ‘బిస్కెట్‌ను ఇవ్వడం, తీసుకోవడంలో కొత్త అర్థం ఉంటుంది' అని ఐసీసీ ట్వీట్ చేసింది. అనంతరం ఇరుజట్ల కెప్టెన్లు బిస్కెట్ ట్రోఫీ పట్టుకున్న ఫొటోను, గతంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ, పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పట్టుకున్న పాత ఫొటోను జత చేసి ఈ ట్రోఫీ గురించి బాధపడకండి అంటూ మరో ట్వీట్ చేసింది ఐసీసీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications