
ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ కింద
ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ కింద పాకిస్తాన్ మరియు ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ ఆడినప్పుడల్లా ఇందులో మూడు టెస్టులు ఉంటాయని తెలిపారు. 1998 నుండి ఆస్ట్రేలియా పాకిస్తాన్‌లో పర్యటించలేదు. ఇప్పటివరకు పాకిస్థాన్ తమ సొంత సిరీస్‌లను శ్రీలంక, ఇంగ్లాండ్ లేదా యుఎఇ లాంటి తటస్థ వేదికలలో నిర్వహిస్తూ వస్తోంది.

టెస్ట్ మ్యాచ్‌లకు తగిన ప్రాముఖ్యత
అయితే, ప్రస్తుత ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ షెడ్యూల్‌లో పాక్ బోర్డు అంగీకరించినప్పటికీ టెస్ట్ మ్యాచ్‌లకు తగిన ప్రాముఖ్యత ఇవ్వలేడం లేదని పీసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలో "ఒక సీజన్‌లో అతి తక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడే దేశాలలో పాక్ ఉండటం దురదృష్టకరం. ఇతర దేశాలు ఒక ఏడాదిలో 8 నుండి 14 టెస్టులు ఆడగా, పాక్ ఆరు నుండి ఏడు కూడా ఆడటం లేదు" అని అన్నారు.

పాక్ అత్యంత సురక్షిత ప్రాంతమని
మరోవైపు పాకిస్థాన్ చైర్మన్ ఎహ్‌సాన్ మణి మాట్లాడుతూ పాక్ అత్యంత సురక్షిత ప్రాంతమని, ఈ గడ్డపై నిరభ్యంతరంగా క్రికెట్ ఆడొచ్చనే సందేశాన్ని ఈ సిరీస్‌తో ప్రపంచానికి చాటి చెబుతామని అన్నాడు. ఇప్పటినుంచి తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడబోమని, ఇకపై తమతో మ్యాచ్‌లు ఆడాలనుకుంటే పాకిస్థాన్‌కే రావాలని స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో స్వదేశంలో సిరీస్‌లు జరుగుతాయి
మరో రెండుమూడేళ్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో స్వదేశంలో సిరీస్‌లు జరుగుతాయని ఎహ్‌సాన్ మణి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్‌కు చెందిన కొంతమంది ప్లేయర్స్ తమ దేశంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారని పేర్కొన్నాడు. పాక్‌లో ఆడకుండా ఉండేందుకు తమకు కారణాలు దొరకడం లేదని క్రికెట్ ఐర్లాండ్ సీఈఓ తమతో అన్నట్లు వెల్లడించాడు.

2022లో ఆస్ట్రేలియాతో పాక్‌లో సిరీస్ నిర్వహిస్తాం
2021లో ఇంగ్లాండ్‌తో, 2022లో ఆస్ట్రేలియాతో పాక్‌లో సిరీస్‌లు నిర్వహిస్తామని, అదేవిధంగా వీలైతే 2023-24లో న్యూజిలాండ్‌తో సిరీస్ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక, రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంక-పాక్‌ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. అనంతరం డిసెంబర్ 19 నుంచి 23 వరకు రెండో టెస్టు జరగనుంది.


Click it and Unblock the Notifications












