
హైదరాబాద్: రాబోయే ఆసియాకప్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్యమివ్వనుంది. వరల్డ్ టీ20కి ఒక నెల ముందు ఈ టోర్నీని నిర్వహించనున్నారు. సెప్టెంబరు, 2020లో జరిగే ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్లు ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) తెలిపింది.
అయితే మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోనా లేక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోనా అనేది వెల్లడించలేదు. రాబోయే ఆసియాకప్‌పై ఏసీసీ ప్రెసిడెంట్ నజ్ముల్ హాసన్ మాట్లాడుతూ "2020 ఆసియా కప్ పాకిస్థాన్‌లో నిర్వహిస్తున్నాం. అయితే, టోర్నీని ఎక్కడ నిర్వాహించాలనే దానిపై నిర్ణయానికి రాలేదు" అని అన్నారు.
క్రికెటర్లకు భద్రత లేదనే కారణంతో పాకిస్థాన్‌లో అంతర్జాతీయ టోర్నీలు ఆడేందుకు పలు ఆదేశాలు ఆసక్తిని కనబర్చడం లేదు. ఇక, టీమిండియా సైతం పాక్‌లో పర్యటించాలంటే భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అదంత సులువు కాదు. దీంతో గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ తాత్కాలిక వేదికగా మ్యాచ్‌లు ఆడుతోన్న యూఏఈనే ఆసియా కప్‌కు వేదిక కానుందని తెలుస్తోంది.