భారత్-పాక్ మ్యాచ్: దుబాయిలో బీసీసీఐతో మాట్లాడనున్న పాక్ బోర్డు

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. దీంతో వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్‌ల మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మాజీ ఆటగాళ్లు, హర్బజన్ పాకిస్తాన్‌తో ఎట్టి పరిస్థితిలో క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని కొండబద్దలు కొట్టినారు. ఇదే కోవలోకి మాజీ బీసీసీఐ అధికారి కూడా పాకిస్తాన్‌తో ఎట్టి పరిస్థితిలో ఆడకూడదని తెలిపాడు.
దీనితో పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో కలవరం మొదలైనట్టుంది. అందుకే దుబాయిలో జరగబోయే ఐసీసీ మీటింగ్‌లో బీసీసీఐతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాట్లాడనున్నదని తెలుస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ బోర్డు క్రీడలను, రాజకీయాలను ఒకటిగా చూడకూడదని హిత బోధ చేసిన సంగతీ తెలిసిందే.
అయితే ఇప్పటికే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ మ్యాచ్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ కప్ మ్యాచ్‌లు మాత్రమే జరగతున్నాయి. అయితే ఈ పరిణామాల నేపధ్యంలో ఇదివరకే ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ స్పందించారు.
"ప్రస్తుతానికి ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదని యధాప్రకారమే జరుగుతంది" అని తెలిపారు. అయితే జూన్ 16న మాంచెస్టర్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇంకా రిచర్డ్‌సన్ స్పందిస్తూ పుల్వామా ఘటనలో మరణించిన జవాన్లకు తన సానుభూతి వ్యక్తం చేసాడు. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ సభ్య దేశాలతో సమీక్షిస్తున్నాం" అని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications