ఎక్కడ ఏ క్రీడా పోటీలు జరిగిన చూడడానికి ప్రేక్షకులకు అనుమతి ఇస్తారు. దీని వల్ల నిర్వాహకులకు డబ్బులు కూడా వస్తాయి. కానీ.. పాకిస్థాన్ మాత్రం ఇలా జరగడం లేదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే రెండో టెస్ట్ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ స్వదేశంలో బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. మొదటి టెస్ట్ ఆగస్ట్ 21న రావల్పిండిలో జరగనుంది.
రెండో టెస్ట్ ఆగస్ట్ 30న కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. పాకిస్థాన్ వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తోంది. ఇందుకు కోసం కరాచీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల ఏర్పాటుతో పాటు కొన్ని పనులు చేపడుతోంది. దీంతో ఈ స్టేడియంలో జరిగే రెండో టెస్ట్ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. దీనిపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ స్పందించారు.

ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరగడమేంటని ప్రశ్నించాడు. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ పరువు పోతుందని విమర్శించారు. పాకిస్థాన్ నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ముందే తెలుసు.. అలాంటప్పుడు మ్యాచ్ ను మరో స్టేడియంలో నిర్వహించవచ్చు కదా అని అన్నారు. అక్కడ మ్యాచ్ నిర్వహించాలని ఎందుకు నిర్ణయించారని ప్రశ్నించారు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరగడం మన దేశానికి అవమానమని అభివర్ణించాడు.
పాక్ లో కేవలం మూడు, నాలుగు స్టేడియాలే లేపు కదా.. చాలా స్టేడియాలుఉన్నాయని పేర్కొన్నాడు. ఫైసలాబాద్ స్టేడియంలో కూడా మ్యాచ్ నిర్వహించవచ్చు కదా అని ప్రశ్నించారు. ముల్తాన్‌లో కూడా మ్యాచ్ నిర్వహించవచ్చు.. అక్కడ స్టేడియం బాగుంటుందని అన్నారు. ప్రేక్షకులు లేకుండా టెస్ట్ మ్యాచ్ నిర్వహించడం సరైంది కాదన్నాడు. మరోవైపు పాక్ క్రికెట్ బోర్డ్ ఖర్చులు తగ్గించుకోవడానికి అద్దె ప్రాతిపదికన ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయనుంది.