INDvsPAK: భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌లపై పీసీబీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పాపులర్ రైవలరీ ఏదైనా ఉందంటే అది భారత్ - పాకిస్తాన్ వైరమే. అందుకే ఈ రెండు జట్లు ఎప్పుడు ఆడినా వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలైపోతుంటాయి. అయితే ఈ రెండు దేశాల ప్రభుత్వాల మధ్య పరిస్థితులు బాగలేవు. ఈ కారణంగా దశాబ్ద కాలంగా భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ వంటి మల్టీ నేషనల్ టోర్నమెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి.

క్రికెట్‌లోకి రాజకీయాలు వద్దు
ఇలా రెండు దేశాలు క్రికెట్ ఆడకపోవడాన్ని చాలా మంది పాకిస్తాన్ మాజీలు తప్పుబట్టారు. పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రజా కూడా ఆటలోకి రాజకీయాలు తీసుకురావడం కరెక్ట్ కాదని చాలా సార్లు చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ వంటి టోర్నీల్లో భారత్, పాకిస్తాన్ మ్యాచులకు వచ్చే వ్యూయర్‌షిప్‌ను చూపించిన అతను.. అభిమానులకు ఈ రెండు దేశాలు ఆడాలని ఉందని, కాబట్టి రాజకీయాలు పక్కనపెట్టి ఆటను బతికించాలని పెద్ద పెద్ద డైలాగులు కూడా వేశాడు. అయితే స్వదేశంలో వరుసగా సిరీసులు ఓడిపోవడంతో తాజాగా అతన్ని పీసీబీ చీఫ్‌గా తొలగించారు. నజమ్ సేథి నేతృత్వంలోని 14 మంది బృందానికి ఈ బాధ్యతలు అప్పగించారు.

ఆసియా కప్‌పై వివాదం..
వచ్చే ఏడాది ఆసియా కప్‌ను పాకిస్తాన్‌లోనే నిర్వహిస్తున్నారు. అయితే భారత జట్టు మాత్రం పాకిస్తాన్ వెళ్లబోదని, టోర్నీని తటస్థ వేదికకు మారుస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై పీసీబీ ఘాటుగా స్పందించింది. భారత్ కనుక ఆసియా కప్ కోసం పాక్‌కు రాకపోతే.. వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ కూడా భారత్‌కు రాదని రమీజ్ రజా బెదింరించాడు. అయితే పాకిస్తాన్‌కు ఇలాంటి ధైర్యమైన నిర్ణయం తీసుకునే సత్తా లేదని పలువురు మాజీలు కుండ బద్దలు కొట్టేసిన సంగతి తెలిసిందే.

భారత్-పాక్ సిరీసులపై..
పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నజమ్ సేథి.. విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీసుల విషయంలో ప్రభుత్వాల జోక్యం తప్పనిసరి అని చెప్పాడు. భారత్, పాక్ క్రికెట్ ఆడటం చాలా ముఖ్యమన్న అతను.. ఈ విషయంలో రెండు దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని, ఆ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.
అలాగే న్యూజిల్యాండ్ సిరీస్‌కు ప్రకటించిన జట్టుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కానీ ఇలా వివిధ దేశాలు పాకిస్తాన్ పర్యటనకు రావడం శుభసూచకం అని చెప్పాడు. దేశవాళీల నుంచి మంచి ఆటగాళ్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications