For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌ అవసరం మాకు లేదు.. మేం మనుగడ సాధించగలం: పీసీబీ ఛైర్మన్‌

PCB chief Ehsan Mani says Pakistan cricket doesn’t need India to survive

కరాచీ: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తీవ్ర నష్టాల్లో ఉందని ఛైర్మన్‌ ఇషాన్ మణి తెలిపాడు. అయితే తమ మనుగడకు భారత్‌ అవసరం లేదన్నాడు. టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో ఇషాన్ తన అక్కసును మరోసారి బయటపెట్టాడు. రాజకీయాలను, క్రీడలను వేరుగా ఉంచాలనుకుంటున్నామని ఇషాన్ చెప్పుకొచ్చాడు. మంగళవారం పీసీబీ మీడియా విభాగం విడుదల చేసిన పోడ్కాస్ట్‌లో ఇషాన్ పై వ్యాఖ్యలు చేసాడు.

 మా ప్రణాళికల్లో భారత్‌ లేదు:

మా ప్రణాళికల్లో భారత్‌ లేదు:

'పీసీబీ నష్టాలతో బాధపడుతుంది. అయినా మా ఆలోచనల్లో, ప్రణాళికల్లో భారత్‌ లేదు. వారు లేకుండానే మేం మనుగడ సాధించగలం. భారత్‌ మాతో ఆడాలని భావించకపోతే.. మేం కూడా వారు లేకుండానే మ్యాచ్‌ల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. గతంలో ఒకటి లేదా రెండు సార్లు ఆడతామని చెప్పి చివరి నిమిషంలో తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు' అని ఇషాన్ మణి తెలిపాడు.

రాజకీయాలను, క్రీడలు వేరు:

రాజకీయాలను, క్రీడలు వేరు:

'ప్రస్తుతం భారత్‌తో ఐసీసీ ఈవెంట్స్‌, ఆసియా కప్‌లో మాత్రమే ఆడుతున్నాం. ఆటపై ఎంతో ఆసక్తితో ఉన్నాం. రాజకీయాలను, క్రీడలను వేరుగా ఉంచాలనుకుంటున్నాం' అని ఛైర్మన్‌ ఇషాన్ మణి పేర్కొన్నాడు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాల్గొనట్లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే ఆడుతోంది.

ఆసియా కప్ 2020పై అనిశ్చితి:

ఆసియా కప్ 2020పై అనిశ్చితి:

కరోనా కారణంగా ఆసియా కప్ 2020 టోర్నీ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్ 2020పై అనిశ్చితి నెలకొంది అని మణి తాజాగా ఓ ప్రకటనలో తెలిపాడు. 'ఆసియా కప్ 2020పై అనిశ్చితి నెలకొంది. అయితే టోర్నీ రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. సెప్టెంబరు నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో? ఇప్పుడే చెప్పలేం. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అనేక అంశాలపై టోర్నీ జరగడం ఆధారపడి ఉంటుంది. కొన్ని నెలల్లో పరిస్థితులు అదుపులోకి వస్తాయనుకుంటా' అని చెప్పుకొచ్చాడు.

 కపిల్‌ దేవ్‌ ఫైర్:

కపిల్‌ దేవ్‌ ఫైర్:

కరోనా సహాయ చర్యల కోసం నిధులు సమీకరించేందుకు భారత్‌-పాక్‌ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడాలని ఇటీవల మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే అతడి వ్యాఖ్యలను భారత మాజీ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ తిరస్కరించాడు. భారతదేశానికి డబ్బు అవసరం లేదని, ప్రాణాలను పణంగా పెట్టి మ్యాచ్‌ను ఆడాల్సిన అవసరం లేదని చెప్పాడు. వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ కూడా స్పందిస్తూ సమీప భవిష్యత్తులో భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడే అవకాశాలు కనిపించట్లేదన్నాడు.

Story first published: Wednesday, April 15, 2020, 13:18 [IST]
Other articles published on Apr 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+