For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దాయాది జట్లు తలపడితే ప్రపంచ క్రికెట్‌కు మంచిది'

PCB chief Ehsan Mani says India vs Pakistan bilateral series good for health of global cricket

కరాచీ: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక క్రికెట్‌లో మరింతగా ఉంటుంది. ముఖ్యంగా అభిమానుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు అదో మినీ యుద్ధంలా ఫీల్ అయిపోతారు. ఇక ఆటగాళ్లు కూడా ఒకరిపై మరొకరు అప్పుడప్పుడూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి తరుణంలో భారత్‌-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగితే అది ప్రపంచ క్రికెట్‌కు మంచిదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణి అభిప్రాయపడ్డాడు.

ఎహ్‌సన్‌ మణి తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... 'భారత్‌-పాక్ క్రికెట్ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఈ మ్యాచ్‌లకు అత్యధిక వీక్షకులు ఉంటారు. ఐసీసీ లేదా ఏసీసీ ఈవెంట్లలో తప్ప ఇరు జట్లూ ద్వైపాక్షిక క్రికెట్‌ ఆడటం లేదు. దాయాది జట్లు తలపడితే అది ప్రపంచ క్రికెట్‌కు చాలా మంచిది. అయితే మేం మాత్రం భారత్‌తో ఆడాలనే ప్రణాళికలు రూపొందించడం లేదు. అలాగే కొన్ని బోర్డులు తమ తాత్కాలిక ఉద్దేశాలను పక్కనపెట్టి ఆట మంచి కోసం కృషి చేయాలి' అని అన్నాడు.

ఇంతకుముందే పాకిస్తాన్ దిగ్గజ బౌలర్లు వకార్‌ యూనిస్‌, షోయబ్‌ అక్తర్‌ సైతం ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ జరగాలని కోరుకున్నారు. అక్తర్‌ ఏకంగా కరోనా వైరస్ బాధితుల కోసం భారత్‌-పాక్‌ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల ఛారిటి సిరీస్‌ నిర్వహించాలన్నాడు. ఈ ప్రతిపాదనను భారత దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

2013 జనవరిలో పాక్‌ జట్టు భారత్‌లో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచీ ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. కేవలం ఐసీసీ, లేదా ఆసియా కప్‌ల సందర్భంగానే దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఇక 2007-2008 సీజన్‌లో ఇరు జట్లు చివరిసారి టెస్టు సిరీస్‌ ఆడాయి. చివరగా వన్డేల్లో 2019 ప్రపంచకప్‌ ఆడగా.. భారత్ సాధించింది. ఈ ఏడాది ఆసియా కప్‌లో తలపడాల్సి ఉండగా.. కరోనాతో టోర్నీ వాయిదా పడింది.

Story first published: Tuesday, July 14, 2020, 18:48 [IST]
Other articles published on Jul 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+