Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ కోసం ఆసియాకప్‌ వాయిదా వేయం: పీసీబీ

PCB Chairman Ehsan Mani says Won’t agree to Asia Cup cancellation to accommodate IPL

కరాచీ: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మనుగడకు భారత్‌ అవసరం లేదని పీసీబీ బోర్డు ఛైర్మన్‌ ఇషాన్ మణి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతటి ఆగకుండా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్-13 కోసం ఆసియా కప్‌ను వాయిదా వేయడానికి అంగీకరించమని స్పష్టం చేసాడు. కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్‌.. ఏప్రిల్ 15కు వాయిదా పడింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడగించడంతో.. టోర్నీ నిరవధిక వాయిదా పడింది.

ఆసియాకప్‌ వాయిదా వేయం:

ఆసియాకప్‌ వాయిదా వేయం:

మహమ్మారి కరోనా తీవ్రత తగ్గితే సెప్టెంబర్‌-అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే సెప్టెంబర్‌లో దుబాయ్‌ వేదికగా ఆసియా కప్‌నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఐపీఎల్ లీగ్‌ కోసం ఆసియా కప్‌ను వాయిదా వేయమని ఇషాన్ మణి అన్నాడు. 'ఐపీఎల్ టోర్నీపై వస్తున్న ఊహాగానాలు గురించి విన్నాను. ఆసియా కప్‌ నిర్వహణపై కేవలం భారత్, పాక్‌ నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. దీనిలో ఇతర దేశాలు కూడా భాగమై ఉన్నాయి. అయితే సెప్టెంబర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తే ఆసియా కప్‌ నిర్వహించడం ఎంతో ముఖ్యం' అని మణి అన్నాడు.

 ఆసియాకప్‌ ఎంతో కీలకం:

ఆసియాకప్‌ ఎంతో కీలకం:

'ఆసియా కప్‌ నిర్వహించడం ద్వారా వచ్చే నిధులపై ఆసియా క్రికెట్‌ అభివృద్ధి ఆధారపడి ఉంది. అంతేకాక ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సభ్య దేశాలకు ఇది ఎంతో కీలకం. వచ్చే రెండేళ్ల వరకు సభ్య దేశాల క్రికెట్‌ అభివృద్ధికి ఆ నిధులు దోహదపడతాయి. ఇక కరోనా కారణంగా ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జరగకపోతే దేశాలు ఆర్థికంగా నష్టపోతాయి. మెగాటోర్నీ వాయిదా పడితే ఐసీసీ నుంచి రావాల్సిన నిధులు అందక పాకిస్థాన్‌తో సహా మిగిలిన దేశాలన్నీ ఇబ్బంది పడతాయి. జూన్‌ నుంచి వచ్చే జనవరి వరకు ఐసీసీ నుంచి తమ దేశానికి 7-8 మిలియన్ల డాలర్లు రావాల్సి ఉంటుంది, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాకపోవచ్చు. దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం' అని మణి పేర్కొన్నాడు.

ఐసీసీ టోర్నమెంట్స్‌కు ఆతిథ్యం ఇస్తాం:

ఐసీసీ టోర్నమెంట్స్‌కు ఆతిథ్యం ఇస్తాం:

'2023-31లో ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్‌ ఆసక్తిగా ఉంది. ఐసీసీ పోటీలను నిర్వహించడానికి అంతకుముందు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు అవకాశం దక్కింది. మేము కూడా సిద్దంగానే ఉన్నాం. ఈసారి ఆతిథ్యం ఇచ్చే అవకాశం కోసం అన్ని దేశాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి' అని పీసీబీ బోర్డు ఛైర్మన్‌ ఇషాన్ మణి చెప్పుకొచ్చాడు. 2009లో శ్రీలంక క్రికెటర్లపై లాహోర్‌లో ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో క్రికెట్ ఆడేందుకు గత దశాబ్దకాలంగా ఏ అగ్రశ్రేణి క్రికెట్ జట్టు కూడా వెళ్లలేదు. దీంతో ఆర్థికంగా ఇప్పటికే చితికిపోయిన పీసీబీ.. ప్రపంచకప్‌ రద్దయితే మరింతగా ఇబ్బందుల్లో పడనుంది.

కంగారు మొదలైంది:

కంగారు మొదలైంది:

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ రద్దయ్యే సూచనలు కనిపిస్తుండటంతో.. ఇప్పుడు పాకిస్థాన్‌లో కంగారు మొదలైంది. కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ చివరలో రద్దవడంతో ఆర్థికంగా నష్టపోయిన పాకిస్థాన్ బోర్డు.. టీ20 ప్రపంచకప్‌ కూడా రద్దయితే కోట్లలో నష్టపోనుంది. సాధారణంగా ప్రపంచకప్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఐసీసీ సభ్య దేశాల క్రికెట్ బోర్డులకి పంచుతుంది.

Story first published: Wednesday, April 15, 2020, 16:06 [IST]
Other articles published on Apr 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+