Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మ‌రోసారి పీసీబీ అక్క‌సు.. ఐపీఎల్‌ కోసం ఆసియా కప్ షెడ్యూల్‌ మార్చితే ఊరుకోం!!

PCB CEO Wasim Khan says Wont accept change of Asia Cup schedule to accommodate IPL 2020
IPL 2020 : PCB Not Agree Rescheduling of Asia Cup For IPL 13

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( పీసీబీ) భార‌త్‌పై మ‌రోసారి త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఆసియా కప్ షెడ్యూల్‌ని మార్చబోమని పీసీబీ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ కారణంగా అసలు ఈఏడాది క్రికెట్‌ టోర్నీలు జరగడం సందేహాస్పదంగా మారిన తరుణంలో ఆసియా కప్‌ షెడ్యూల్‌ను భారత్‌ మార్చడానికి యత్నిస్తుందంటూ ఆరోపణలు చేస్తోంది.

పాక్ ఆరోపణలు:

పాక్ ఆరోపణలు:

షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. సెప్టెంబరులో ఆసియా కప్‌కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుండగా.. పాక్ గడ్డపై భారత్‌ జట్టుని పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో ఆ టోర్నీని యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నారు. అయితే ఆసియా కప్‌ని పాక్ వాయిదా వేస్తే.. సెప్టెంబరులో ఐపీఎల్‌ని నిర్వహించుకోవచ్చని బీసీసీఐ భావిస్తోందని పాక్ ఆరోపిస్తోంది. కానీ ఐపీఎల్ కోసం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసియా కప్‌ షెడ్యూల్‌ని మార్చబోమని పీసీబీ సీఈవో వసీం ఖాన్ స్పష్టం చేశాడు.

షెడ్యూల్‌ మార్చితే చూస్తూ ఊరుకోం:

షెడ్యూల్‌ మార్చితే చూస్తూ ఊరుకోం:

'మా వైఖరి చాలా క్లియర్‌గా ఉంది. ఆసియా కప్‌కు సెప్టెంబర్‌లో షెడ్యూల్‌ చేయబడి ఉంది. ఇది పాకిస్తాన్‌లో జరగాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల దుబాయ్‌లో నిర్వహిస్తున్నాం. మొత్తం ఆసియా కప్‌ షెడ్యూల్‌నే మార్చాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోం. ఐపీఎల్‌ కోసం ఆసియాకప్‌ను మార్చాలనే చర్చలు ఆరంభం అయినట్లు మాకు సమాచారం ఉంది. దీన్ని మేము సహించం. ఆసియాకప్‌ను నవంబర్‌-డిసెంబర్‌లో జరపడానికి ప‍్రయత్నాలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అలా అయితే అది మాకు సాధ్యం కాదు' అని వసీం ఖాన్ అన్నాడు.

బీసీసీఐకి మా సహకారం ఉండదు:

బీసీసీఐకి మా సహకారం ఉండదు:

'కేవలం ఆసియాకప్‌ను సభ్యత్వ దేశాల్లో ఉన్న ఒక దేశం కోసం దాని షెడ్యూల్‌ను మార్చిస్తే అది చాలా దారుణం. దానికి మాకు సహకారం అస్సలు ఉండదు' అని వసీం ఖాన్‌ తెలిపారు. అయితే ఐపీఎల్‌ను ఏ ప్రధాన సిరీస్‌లు మిస్‌ కాకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అక్టోబర్‌ విండోను అనుకుంటున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఆసియా కప్‌ అనేది అక్టోబర్‌ 6వ తేదీతో ముగుస్తుంది.దీని తర్వాతే ఐపీఎల్‌ను ప్లాన్‌ చేయాలని అనుకుంటున్నారు. అన్ని సవ్యంగా సాగితే ఇదే సరైనది బీసీసీఐ భావిస్తోంది. కాకపోతే ఐపీఎల్‌ కోసం ఆసియాకప్‌ షెడ్యూల్‌ను మార్చాలనే చర్చలు ఇప్పటివరకూ జరగలేదు.

Story first published: Friday, April 24, 2020, 20:13 [IST]
Other articles published on Apr 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+