హైదరాబాద్: పాకిస్థాన్ జట్టుకు ఇకపై మూడు ఫార్మాట్లలో సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ మంగళవారం ప్రకటించాడు. ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ను సర్ఫరాజ్ విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా పాక్ ఆటగాళ్లకు గౌరవార్ధం ఏర్పాటు చేసిన ఓ ఫంక్షన్‌లో మిస్బా ఉల్ హక్ స్ధానంలో సర్ఫరాజ్‌ను టెస్టు కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ చెప్పాడు. పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ కూడా సర్ఫరాజ్ కెప్టెన్సీకి ఆమోదం తెలిపాడు.

ఏడాది ఫిబ్రవరిలో అజల్ అలీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో సర్ఫరాజ్ వన్డే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక 2016 టీ20 వరల్డ్ కప్ ముగిశాక అఫ్రిది నుంచి టీ20 కెప్టెన్సీ అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో పాక్‌కు ఒకే కెప్టెన్ ఉండడం ఐదేళ్లలో ఇదే తొలిసారి.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సర్ఫరాజ్ పాకిస్ధాన్‌కు మంచి విజయాలను అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 8వ ర్యాంకుతో బరిలోకి దిగిన పాకిస్థాన్ నిలకడగా రాణించి ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్ధి భారత్‌పై అద్భుత విజయాన్ని సాధించి ఛాంపియన్‌గా అవతరించింది.