రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయినా సరే చివర్లో శామ్ కర్రాన్ (49 నాటౌట్), షారుఖ్ ఖాన్ (43 నాటౌట్) అద్భుతంగా ఆడారు. వీరితోపాటు జితేశ్ శర్మ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పంజాబ్ మంచి స్కోరు చేసింది.
పంజాబ్ చేసిన 187 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్‌కు సరైన ఓపెనింగ్ లభించలేదు. ఆ టీం స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో అతను మరోసారి డకౌట్ అయ్యాడు. ఇది అతనికి వరుసగా మూడో డకౌట్ కావడం గమనార్హం. గత రెండు మ్యాచుల్లో కూడా బట్లర్ డకౌటే అయ్యాడు. అదే సమయంలో యువ ఓపెన్ యశస్వి జైస్వాల్ మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

జైస్వాల్ (50)తో పాటు మరో కుర్ర ప్లేయర్ దేవదత్ పడిక్కల్ (51) రాణించడంతో రాజస్థాన్ లక్ష్యాన్ని ఛేదించే దిశగా సాగింది. తక్కువ వ్యవధిలోనే వీళ్లిద్దరూ అవుటయ్యారు. అయితే షిమ్రాన్ హెట్మెయర్ (46), రియాన్ పరాగ్ (20) చివర్లో చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో రాజస్థాన్ విజయం దిశగా దూసుకుపోయింది.
చివర్లో కొత్త కుర్రాడు ధృవ్ జురెల్ (10 నాటౌట్) భారీ సిక్సర్‌తో ఈ ఛేజ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రాజస్థాన్ ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో మిగిలే ఉంది. ఇలా చివరి లీగ్ మ్యాచులో ఓడిపోవడంపై పంజాబ్ కింగ్స్ సారధి శిఖర్ ధవన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము సరిగా బౌలింగ్ చేయలేదని అభిప్రాయపడ్డాడు.
'జితేష్, షారుఖ్, శామ్ కర్రాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత రాణించారు. ఇక్కడ 200 పరుగులు చేసి ఉంటే మంచి స్కోరు అని నేను అనుకున్నా. మా టీంలో అన్ని విభాగాలు సరిగా క్లిక్ కాలేదని అనుకుంటున్నా. ఇది చాలా యంగ్ టీం. కాబట్టి పెర్ఫామెన్స్ అనేది ఒక్కోసారి పైకి వెళ్తే.. మరోసారి కిందకు పడిపోవడం సహజమే' అని ధవన్ అన్నాడు.
'ఈ కుర్ర టీం కొన్ని పొరపాట్లు చేసింది. అదే సమయంలో వాటి నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంది. చివరి డెత్ ఓవర్లలో స్పిన్నర్లు బౌలింగ్ ఇవ్వడం అంటారా.. నా బెస్ట్ బౌలర్లను ముందే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్‌ను సాధ్యమైనంత డీప్‌గా తీసుకెళ్లాలని అనుకున్ానం. చివరి మ్యాచ్‌లో బ్రార్‌కు ఆ ఓవర్ ఇచ్చా. అప్పుడు ఒక గుణపాఠం నేర్చుకున్నా' అని ధవన్ వివరించాడు.