పంజాబ్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచులో సునాయాస విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఇంకా ప్లేఆఫ్స్ రేసులో సజీవంగానే ఉంది. ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరడం దాదాపు అసాధ్యం అయినా కూడా.. మిగతా మ్యాచుల ఫలితంపైనే ఈ టీం అవకాశాలు ఆధార పడి ఉన్నాయి. మరి రాజస్థాన్ ఈసారి ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా మ్యాచుల ఫలితాలో ఎలా ఉండాలో చూద్దామా?
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ఒక్కటే క్వాలిఫైయర్-1లో తన స్థానం పదిలం చేసుకుంది. ఇక మిగిలిన మూడు ప్లేఆఫ్స్ బెర్తుల కోసం మిగిలిన టీమ్స్ పోటీ పడుతున్నాయి. వీటిలో చెన్నై కూడా దాదాపుగా ప్లేఆఫ్స్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మిగతా రెండు ప్లేఆఫ్స్ బెర్తుల కోసం లక్నో, బెంగళూరు, ముంబై, రాజస్థాన్ మధ్య పోటీ నెలకొంది.

రాజస్థాన్ కనుక ప్లేఆఫ్స్ చేరాలంటే.. తర్వాత జరిగే మ్యాచ్‌లో కోల్‌కతాపై లక్నో మంచి విజయం సాధించాలి. లేదంటే కేకేఆర్ 103 పరుగుల కన్నా తక్కువ రన్స్ తేడాతో విజయం సాధించాల్స ఉంటుంది. అయితే ఈ ఒక్క మ్యాచ్ ఫలితం ఇలా వస్తే రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరడం కుదరదు. మిగతా మ్యాచుల ఫలితాలు కూడా ఈ టీంకు అనుకూలంగానే రావాలి.
అలాగే వాంఖడే వేదికగా తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు ముంబై ఇండియన్స్ రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరబాద్‌తో ముంబై తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే రాజస్థాన్ అవకాశాలు బాగా దెబ్బతింటాయి. అంటే రాజస్థాన్ కనుక ప్లేఆఫ్స్ చేరాలంటే ముంబైపై సన్‌రైజర్స్ అద్భుతమైన విజయం సాధించాలి. వాంఖడేలో ముంబై ఇండియన్స్ రికార్డు చూస్తే ఇది అసాధ్యమే అనిపిస్తోంది.
ఇక చివరగా మరో మ్యాచ్ ఫలితం కూడా రాజస్థాన్‌కు అనుకూలంగానే రావాల్సి ఉంటుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్, ఆర్సీబీ తలపడాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీని కనీసం 5 పరుగులు లేదంటే అంతకన్నా ఎక్కువ రన్స్ తేడాతో గుజరాత్ ఓడించాలి. ఇలా ఈ మూడు మ్యాచుల్లో ఇలాంటి ఫలితం వస్తే.. రాజస్థాన్ కూడా ప్లేఆప్స్ చేరుతుంది. లేదంటే ఇక వచ్చే సంవత్సరం కోసం ఎదురు చూడక తప్పదు.