Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKSvsRR : కుర్రాళ్ల సూపర్ బ్యాటింగ్.. చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ జయభేరి!

పంజాబ్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. అయినా సరే చివర్లో శామ్ కర్రాన్ (49 నాటౌట్), షారుఖ్ ఖాన్ (43 నాటౌట్) అద్భుతంగా ఆడారు. వీరితోపాటు జితేశ్ శర్మ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పంజాబ్ మంచి స్కోరు చేసింది.

పంజాబ్ చేసిన 187 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్‌కు సరైన ఓపెనింగ్ లభించలేదు. ఆ టీం స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో అతను మరోసారి డకౌట్ అయ్యాడు. ఇది అతనికి వరుసగా మూడో డకౌట్ కావడం గమనార్హం. గత రెండు మ్యాచుల్లో కూడా బట్లర్ డకౌటే అయ్యాడు. అదే సమయంలో యువ ఓపెన్ యశస్వి జైస్వాల్ మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

PBKSvsRR

జైస్వాల్ (50)తో పాటు మరో కుర్ర ప్లేయర్ దేవదత్ పడిక్కల్ (51) రాణించడంతో రాజస్థాన్ లక్ష్యాన్ని ఛేదించే దిశగా సాగింది. తక్కువ వ్యవధిలోనే వీళ్లిద్దరూ అవుటయ్యారు. అయితే షిమ్రాన్ హెట్మెయర్ (46), రియాన్ పరాగ్ (20) చివర్లో చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో రాజస్థాన్ విజయం దిశగా దూసుకుపోయింది.

చివర్లో కొత్త కుర్రాడు ధృవ్ జురెల్ (10 నాటౌట్) భారీ సిక్సర్‌తో ఈ ఛేజ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన రాజస్థాన్ ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసులో మిగిలే ఉంది. ఇది ఈ రెండు జట్లకు చివరి లీగ్ మ్యాచ్ కావడం గమనార్హం. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్.. మిగతా జట్ల చివరి మ్యాచులను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు ప్రత్యర్థిపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. కగిసో రబాడ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో శామ్ కర్రాన్, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహర్ తలో వికెట్‌తో ఆకట్టుకున్నారు. కానీ కుర్రాళ్ల అద్భుతమైన బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేసింది.

Story first published: Friday, May 19, 2023, 23:41 [IST]
Other articles published on May 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+