Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKSvsRR : చివర్లో రెచ్చిపోయిన పంజాబ్.. రాజస్థాన్ ముందు టఫ్ టార్గెట్!

రాజస్థాన్‌తో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు చివర్లో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. యువ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (2) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అతని తర్వాత శిఖర్ ధవన్ (17) కూడా పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు.

అనంతరం అథర్వ టైడే (19), లియామ్ లివింగ్‌స్టోన్ (9) కూడా ఏమాత్రం ఆకట్టుకోలేదు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ అదరగొట్టాడు. కేవలం 28 బంతుల్లోనే 44 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతనితోపాటు చాలా మ్యాచుల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న శామ్ కర్రాన్ (49 నాటౌట్) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.

PBKSvsRR

అయినా సరే చివరి రెండు ఓవర్ల వరకు పంజాబ్ అంత స్కోరు చేసేలా కనిపించలేదు. అయితే 19వ ఓవర్లో యుజ్వేంద్ర చాహల్‌కు షారుఖ్ ఖాన్ (41 నాటౌట్), శామ్ కర్రాన్ అదరగొట్టారు. వీళ్లిద్దరూ కలిసి ఆ ఓవర్లో ఏకంగా 28 పరుగులు సాధించారు. ఇక ట్రెంట్ బౌల్ట్ వేసిన చివరి ఓవర్లో 18 పరుగులు చేశారు. దీంతో ఆ జట్టు మంచి స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది.

వీళ్లిద్దరూ చివరి రెండు ఓవర్లలో చెలరేగడంతో ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ మూడు వికెట్లతో చెలరేగాడు. ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్ కూడా చెరో వికెట్‌ తీసుకొని ఆకట్టుకున్నారు. చివర్లో చెలరేగిన పంజాబ్ మంచి స్కోరు చేసింది.

ఈ ఛేజింగ్‌లో రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ చాలా కీలకం కానున్నారు. వీళ్లిద్దరూ కనుక రాణిస్తే.. ఈ లక్ష్యాన్ని రాజస్థాన్ సులభంగానే ఛేదిస్తుంది. లేదంటే మిడిలార్డర్ రాణించాల్సి వస్తుంది. అయితే రాజస్థాన్ మిడిలార్డర్ అంత బలంగా కనిపించడం లేదు.

Story first published: Friday, May 19, 2023, 21:35 [IST]
Other articles published on May 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+