ఆరంభంలోనే ఎదురుదెబ్బ
152 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 14 పరుగుల వద్ద ఉండగా 3 పరుగులే చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్.. రబాడ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. అనంతరం రాహుల్ త్రిపాఠితో కలిసి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ రెండో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
రాణించిన త్రిపాఠి, అభిషేక్
ఈ క్రమంలో జట్లు స్కోర్ 62 పరుగుల వద్ద ఉండగా రాహుల్ చాహర్ బౌలింగ్‌లో షారూక్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ త్రిపాఠి(22 బంతుల్లో 34 రన్స్, 4 ఫోర్లు, ఒక సిక్సు) ఔటయ్యాడు. ఆ కాసేపటికే 11వ ఓవర్లో మరోసారి సత్తా చాటిన రాహుల్ చాహర్ సన్‌రైజర్స్ స్కోర్ 77 పరుగుల వద్ద ఉండగా అభిషేక్ శర్మ(25 బంతుల్లో 31 రన్స్, 3 ఫోర్లు, ఒక సిక్సు)ను ఫెమిలియన్ చేర్చాడు. దీంతో 77 పరుగులకు సన్‌రైజర్స్ 3 వికెట్లు కోల్పోయింది. అప్పటికి సన్‌రైజర్స్ విజయానికి మరో 57 బంతుల్లో 75 పరుగులు కావాలి.
సన్‌రైజర్స్ ఘనవిజయం
ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను నికోలస్ పూరన్, ఎయిడెన్ మాక్రమ్ ముందుకు నడిపించారు. వరుస బౌండరీలతో చెలరేగిన వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి మరో ఓవర్ మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. నికోలస్ పూరన్, ఎయిడెన్ మాక్రమ్ నాల్గో వికెట్‌కు అజేయంగా 50 బంతుల్లో 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో మాక్రమ్ 41 పరుగులతో, పూరన్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, రబాడ ఒక వికెట్ తీశారు.
చెలరేగిన ఉమ్రాన్, భువి
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 151 పరుగులకు ఆలౌటైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ చివరి ఓవర్లో 3 వికెట్లు తీయడంతోపాటు మొయిడెన్ చేసిన పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. ఆ ఓవర్లో ఓ రనౌట్ కూడా వచ్చింది. మొత్తంగా ఈ మ్యాచ్‌ల్లో 28 పరుగులిచ్చిన ఉమ్రాన్ మాలిక్ 4 వికెట్లతో చెలరేగాడు. భువనేశ్వర్ కుమార్ కూడా 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి సత్తా చాటడంతో పంజాబ్ బ్యాటర్లలో లివింగ్ స్టోన్ మినహా ఎవరూ రాణించలేకపోయారు. లివింగ్ స్టోన్ 60 రన్స్‌తో రాణించాడు. భువి, ఉమ్రాన్ ధాటికి చివరి 4 ఓవర్లలో పంజాబ్ 19 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోయింది. మిగతావారిలో షారూక్ ఖాన్ 26, ప్రభసిమ్రన్ 14, ఓడియన్ స్మత్ 13, బెయిర్‌స్టో 12, జితేష్ శర్మ 11, శిఖర్ ధావన్ 8 పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, సుచిత్ కూడా తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












