
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రతి మ్యాచ్‌లో టాస్ గెలవడం గమనార్హం. ఇక పాయింట్ల పట్టికలో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఐదో స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడో స్థానంలో ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆడడం లేదు. దీంతో అతని స్థానంలో ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ పంజాబ్‌కు కెప్టెన్సీ చేస్తున్నాడు.

టాస్ గెలిచిన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ''మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. టాస్ గెలిచినప్పుడు ఇటీవల కాలంలో మేము ముందుగా బౌలింగే చేస్తున్నాం. ఇక మేము మా ప్రణాళికల ప్రకారం ఆడాలి. ఇంకా కొంత మెరుగుపడాలి. సంకేతాలు బాగున్నాయి. అలాగే ముందుగా పరిస్థితులను సర్దుబాటు చేసుకోవాలి. ఈ మ్యాచ్‌లో మా తుది జట్టులో ఎలాంటి మార్పు లేదు. ''అని తెలిపాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ ''ప్రాక్టీస్ సమయంలో మయాంక్ అగర్వాల్ కాలి బొటనవేలికి గాయం అయింది. అందుకే ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు. తదుపరి గేమ్ నాటికి అతను అందుబాటులో ఉంటాడు. దీంతో మాయాంక్ అగర్వాల్ స్థానంలో ప్రభసిమ్రాన్ సింగ్ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. మేము జట్టుగా బాగా రాణిస్తున్నాం. బౌలింగ్ యూనిట్ మెరుగ్గా ఉంది. వీడియోలను చూసి మెరుగుపడుతున్నాం. వికెట్ కొంచెం జిగటగా ఉంది. బంతి తిరగవచ్చు.'' అని చెప్పాడు.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మాక్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్