Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs SRH: అదృష్ట‌మంటే స‌న్‌రైజ‌ర్స్‌దే.. ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేస్తే క్యాచ్ ఔట్ దొరికింది

PBKS vs SRH: Sunrisers Hyderabad went to DRS for LBW. But the wicket was found in the catch out

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు అదృష్టం భ‌లే కలిసొచ్చింది. ఎల్బీడ‌బ్ల్యూ కోసం డీఆర్ఎస్‌కు వెళ్తే ఏకంగా క్యాచ్ ఔట్ రూపంలో వికెట్ దొరికింది. అస‌లు ఏం జ‌రిగిందంటే స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ న‌ట‌రాజ‌న్ వేసిన ఐదో ఓవ‌ర్ చివ‌రి బంతిని పంజాబ్ కింగ్స్ ఓపెన‌ర్ ప్రభసిమ్రాన్ సింగ్ ఆడాడు. ఆ బంతి ప్రభసిమ్రాన్ సింగ్ మోకాళ్ల‌కు తాకుతూ వెళ్లి వికెట్ కీప‌ర్ నికోల‌స్ పూర‌న్ చేతిలో ప‌డింది. దీంతో స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్లు అంతా ఎల్బీడ‌బ్ల్యూలో ఔట్ కోసం అప్పీలు చేయ‌గా అంపైర్ ఔట్ ఇవ్వ‌లేదు. దీంతో డీఆర్ఎస్‌కు వెళ్లాలా? వ‌ద్దా? అని కాసేపు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డిన స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ వికెట్ కీప‌ర్ నికోల‌స్ పూర‌న్, బౌల‌ర్ న‌ట‌రాజ‌న్ స‌ల‌హాతో చివ‌రి సెక‌న్‌లో అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్ థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేశాడు.

ఈ రివ్యూపై క్రీజులో ఉన్న పంజాబ్ ఆట‌గాడు జానీ బెయిర్‌స్టో అభ్యంత‌రం వ్య‌క్తం చేశాడు. రివ్యూ తీసుకోవ‌డానికి స‌మ‌యం సున్నా ప‌డిన‌ప్పుడు అప్పీలు చేస్తే థ‌ర్డ్ అంపైర్ చెక్ చేయ‌డంపై అంపైర్‌తో వాదించాడు. కానీ బెయిర్‌స్టో వాద‌న‌ను అంపైర్ ప‌ట్టించుకోలేదు. ఇక థ‌ర్డ్ అంపైర్ త‌న రివ్యూలో ఎల్బీడ‌బ్ల్యూ కన్నా ముందు బంతి బ్యాట్‌కు త‌గిలిందా? లేదా? అని చెక్ చేశాడు. దీంతో రివ్యూలో బంతి బ్యాట్‌కు త‌గ‌లిన‌ట్టు తేలింది. బ్యాట్‌కు త‌గిలిన ఆ బంతిని స‌న్‌రైజ‌ర్స్ వికెట్ కీప‌ర్ నికోల‌స్ పూర‌న్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో థ‌ర్డ్ అంపైర్ ఇక ఎల్బీడ‌బ్ల్యూతో సంబంధం లేకుండా క్యాచ్ ఔట్ ఇచ్చాడు. దీంతో 2 ఫోర్ల‌తో 11 బంతుల్లో 14 ప‌రుగులు చేసిన ప్రభసిమ్రాన్ సింగ్ ఔట‌య్యాడు. ఇలా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఎల్బీడబ్ల్యూలో ఔట్ కోసం డీఆర్ఎస్‌కు వెళ్తే క్యాచ్ ఔట్ దొరక‌డం గ‌మ‌నార్హం.

PBKS vs SRH: Sunrisers Hyderabad went to DRS for LBW. But the wicket was found in the catch out

తుది జ‌ట్లు
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మాక్ర‌మ్, నికోలస్ పూరన్ (వికెట్ కీప‌ర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

Story first published: Sunday, April 17, 2022, 18:28 [IST]
Other articles published on Apr 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+