Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs SRH: పవర్‌ప్లేలో రికార్డు సృష్టించిన భువ‌నేశ్వ‌ర్.. ఆ జాబితాలో తొలి స్థానం

PBKS vs SRH: Bhuvneshwar Kumar holds the record for most wickets in power play in IPL

పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ సీనియ‌ర్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ప‌వ‌ర్‌ప్లేలోనే వికెట్ తీసిన భువనేశ్వ‌ర్ స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ప‌వ‌ర్‌ప్లేలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో ఇంత‌కుముందు వ‌ర‌కు ఈ రికార్డుతో ఉన్న సందీప్ శ‌ర్మ‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ అధిగ‌మించాడు.

ప‌వ‌ర్‌ప్లేలో అత్య‌ధిక వికెట్లు

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్లోనే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ వికెట్ సాధించాడు. ఆ ఓవ‌ర్ నాల్గో బంతికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్‌ను ఔట్ చేశాడు. 11 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 8 ప‌రుగులు చేసిన శిఖ‌ర్ ధావ‌న్ భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి మార్కో జాన్స‌న్‌కు దొరికిపోయాడు. దీంతో 10 ప‌రుగుల వ‌ద్ద పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో ప‌వ‌ర్‌ప్లేలో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా భువ‌నేశ్వ‌ర్ కుమార్ రికార్డు సృష్టించాడు. ప‌వ‌ర్‌ప్లేలో భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇప్ప‌టివ‌ర‌కు 54 వికెట్లు తీశాడు. భువ‌నేశ్వ‌ర్ 138 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు అందుకున్నాడు.

సందీప్ శ‌ర్మ‌ను అధిగ‌మించి

సందీప్ శ‌ర్మ‌ను అధిగ‌మించి మ‌రి ఐపీఎల్‌లో ప‌వ‌ర్‌ప్లేలో భువనేశ్వ‌ర్ కుమార్ అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం భువ‌నేశ్వ‌ర్ కుమార్ త‌ర్వాతి స్థానంలో ఉన్న సందీప్ శ‌ర్మ ప‌వ‌ర్‌ప్లే 53 వికెట్లు తీశాడు. సందీప్ శ‌ర్మ 100 మ్యాచ్‌ల్లో ఈ వికెట్లు తీశాడు. ఇక వీరిద్ద‌రి తర్వాతి మూడో స్థానంలో జ‌హీర్ ఖాన్ ఉన్నాడు. జ‌హీర్‌ఖాన్ ప‌వ‌ర్‌ప్లేలో 52 వికెట్లు తీశాడు. జ‌హీర్ ఖాన్ కూడా 100 మ్యాచ్‌ల్లోఈ వికెట్లు తీశాడు.

61కే 4 వికెట్లు

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన‌ పంజాబ్ కింగ్స్ 61 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్ 8, ప్రభసిమ్రాన్ సింగ్ 14, బెయిర్‌స్టో 12, జితేష్ శ‌ర్మ 11 ప‌రుగులు చేశారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువి, న‌ట‌రాజ‌న్, సుచిత్, ఉమ్రాన్ మాలిక్ త‌లో వికెట్ తీశారు. ప్ర‌స్తుతం క్రీజులో లివింగ్ స్టోన్, షారూక్ ఖాన్ ఉన్నారు.

తుది జ‌ట్లు

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మాక్ర‌మ్, నికోలస్ పూరన్ (వికెట్ కీప‌ర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్

Story first published: Sunday, April 17, 2022, 17:00 [IST]
Other articles published on Apr 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+