PBKS vs SRH: పంజాబ్‌పై సన్‌రైజర్స్ సూపర్ విక్టరీలో కీ రోల్ పోషించిన 4 ప్రధాన అంశాలు ఇవే!

ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతుంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా నాల్గో విజయం. అలాగే ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 151 పరుగులకు ఆలౌట్ కాగా.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన నాలుగు అంశాలను ఓ సారి పరిశీలిద్దాం.

ఆరంభంలోనే 4 వికెట్లు తీయడం
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్‌ను ఆరంభంలోనే 4 వికెట్లు తీసి దెబ్బకొట్టడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి తొలి అడుగుపడింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి తొలి 8 ఓవర్లలో 61 పరుగులే చేసిన పంజాబ్ కింగ్స్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బ్యాటర్లలో ధావన్ 8, ప్రభసిమ్రన్ 14, బెయిర్‌స్టో 12, జితేన్ శర్మ 11 పరుగులు చేసి ఔటయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువి, నటరాజన్, సుచిత్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు.

చివరి 4 ఓవర్లలో19 పరుగులే.. దెబ్బకొట్టిన భువనేశ్వర్
ఈ మ్యాచ్‌లో 16 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ 132 -4 తో పటిష్ట స్థితిలో ఉంది. హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న లివింగ్ స్టోన్ క్రీజులో ఉండడంతో చివరి 4 ఓవర్లలో పంజాబ్ జట్టు భారీగా పరుగులు రాబట్టేలా కనిపించింది. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ చివరి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీశారు. ముఖ్యంగా పంజాబ్ హిట్టర్లైన లివింగ్ స్టోన్‌ను, షారూక్ ఖాన్‌ను భువనేశ్వర్ కుమార్ వరుస ఓవర్లలో ఔట్ చేసి దెబ్బకొట్టాడు. దీంతో డెత్ ఓవర్లలో పంజాబ్‌కు పరుగులు చేసే వాళ్లే కరుయ్యారు. ఇది సన్‌రైజర్స్ విజయానికి రెండో కారణంగా చెప్పవచ్చు.

చివరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ విశ్వరూపం
చివరి ఓవర్ సమయానికి పంజాబ్ 151-6తో బలంగా ఉంది. ఓడియన్ స్మిత్, రబాడ క్రీజులో ఉండడంతో ఆ జట్టు చివరి ఓవర్లో కనీసం 10 పరుగులైనా చేస్తుందని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఉమ్రాన్ మాలిక్ చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీశాడు. చివరి బంతికి రనౌట్ కూడా లభించడంతో పంజాబ్ ఆలౌటైంది. ఉమ్రాన్ మాలిక్ వేసిన చివరి ఓవర్ సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించందనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాణించిన బ్యాటర్లు
ఇక 152 పరుగుల లక్ష్య చేధనలో బ్యాటర్లంతా రాణించడంతో ఎలాంటి తడబాటు లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ కేన్ విలియ్సన్ తక్కువ స్కోర్‌కే ఔటైనప్పటికీ అభిషేక్ శర్మ(31), ఎయిడెన్ మాక్రమ్(41*), నికోలస్ పూరన్ (35*) రాణించి జట్టును గెలిపించారు. ఎయిడెన్ మాక్రమ్, నికోలసో పూరన్ 75 పరుగుల అజేయ భాగస్వామ్యంతో సన్‌రైజర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇలా ఈ 4 కారణాలు ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications