Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - దిగ్గజ క్రికెటర్ రికార్డ్ బద్దలు!!

Sanju samson : రాజస్థాన్ రాయల్స్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్ఆర్ మొదట ఓటములతో ప్రారంభించినా.. ఇప్పుడు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండో గెలుపును ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. తాజా మ్యాచులో పంజాబ్ కింగ్స్‌ను 50 పరుగులు తేడాతో ఓడించింది.

సంజూ అరుదైన ఘనత...
గాయం కారణంగా ఈ సీజన్‌లోని ప్రారంభ మ్యాచుల్లో (3) సారథ్య బాధ్యతలకు దూరంగా ఉన్న సంజూ శాంసన్‌కు కెప్టెన్‌గా మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మ్యాచులో 26 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 38 పరుగులు చేసిన అతడు అదిరే విజయాన్ని అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను కూడా సంపాదించాడు.

PBKS VS RR Sanju Samson creates History As Rajasthan royals captain breaks shane warne record

ఆ దిగ్గజ క్రికెటర్ రికార్డ్ బ్రేక్..
అదేంటంటే RR తరఫున మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు సంజూ శాంసన్. మొత్తం 62 మ్యాచుల్లో 32 విజయాలు సాధించాడు. తద్వారా ఇప్పటివరకు ఆర్ఆర్ తరఫున సారథిగా అత్యధిక విజయాలు నమోదు చేసి షేన్ వార్న్ (55 మ్యాచులు - 31 విజయాలు) రికార్డును బ్రేక్ చేశాడు. కాగా, 2021లో సారథ్య బాధ్యతలు తీసుకున్న సంజూ శాంసన్.. ఈ సీజన్ లోని తొలి మూడు మ్యాచులకు కెప్టెన్సీ చేయలేదన్న సంగతి తెలిసిందే.

ఆర్ఆర్ తరఫున కెప్టెన్‌గా అత్యధిక విజయాలు అందుకున్న ఆటగాళ్లు వీరే
సంజూ శాంసన్ : 32 విజయాలు - 62 మ్యాచులు
షేన్ వార్న్: 31 విజయాలు - 55 మ్యాచులు
రాహుల్ ద్రవిడ్ : 18 విజయాలు - 34 మ్యాచులు
స్టీవ్ స్మిత్ : 15 విజయాలు - 27 మ్యాచులు
అజింక్యా రహానె : 9 విజయాలు - 24 మ్యాచులు

Story first published: Sunday, April 6, 2025, 8:14 [IST]
Other articles published on Apr 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+