రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పేరు ప్రస్తుతం మార్మోగిపోతోంది. అందుకు కారణం అతడు నిద్రలో లేచి వచ్చి ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించడమే! అదేంటి నిద్రలో లేచి వచ్చి ఏంటని ఆలోచిస్తున్నారా? హా అవును మీరు చదివింది నిజమే. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ఆర్చర్ అదే పని చేశాడు. మైదానంలో తమ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో దుప్పటి కప్పుకుని కంటినిండా నిద్రపోయిన అతడు.. ఆ తర్వాత పంజాబ్ బ్యాటింగ్ సమయంలో నిద్ర లేచి వచ్చి మరీ ఊచకోత కోచాడు. తన అద్భుతమైన స్పెల్ తో రాజస్థాన్ జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొఖం కడుక్కొని వచ్చి..
పంజాబ్ బ్యాటింగ్ కు దిగగానే ఫుల్ నిద్రలో నుంచి లేచి మొఖం కడుక్కొని బౌలింగ్ వేయడానికి వచ్చాడు జోఫ్రా ఆర్చర్. వచ్చీ రాగానే తన రా పేస్ ఆటతో తొలి ఓవర్ లోనే కీలక వికెట్లు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (10), ప్రియాంశ్ ఆర్య (0)ను బోల్తా కొట్టించాడు. ప్రియాంష్ ఆర్య ను డక్ ఔట్ చేసిన ఆర్చర్... భయంకరమైన ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ను కూడా బౌల్డ్ చేశాడు. దీంతో పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయింది పంజాబ్ కింగ్స్. ఇక చివర్లో అర్షదీప్ సింగ్ వికెట్ కూడా తీశాడు ఆర్చర్. అలా ఈ మ్యాచులో అతడు పంజాబ్ కింగ్స్ ను (3/25)తో గట్టిగా దెబ్బ తీశాడు.

తొలి రెండు మ్యాచులో తుస్సు..
వాస్తవానికి ఈ సీజన్ లో మొదటగా ఆర్చర్ అంతగా రాణించలేదు. తొలి రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండానే ఏకంగా 109 పరుగులు సమర్పించుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో అయితే అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. అయితే గత మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ పై గట్టి కమ్ బ్యాక్ ఇచ్చాడు. తన బ్రిలియంట్ స్వింగ్ అండ్ పేస్ బౌలింగ్ తో ఒక్క వికెట్ తీసి 13 పరుగులే సమర్పించుకున్నాడు. ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ పై కూడా అదే ఫైర్ అండ్ ఎనర్జీతో చెలరేగి ప్రదర్శన చేశాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.