PBKS VS RCB: అసభ్యకర రీతిలో కోహ్లీ సంబరాలు - అర్జున్ రెడ్డి స్ట్రైల్‌లో!
PBKS VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా మహరాజా యదవీంద్రా సింగ్ స్డేడియం వేదికగా నేడు (ఏప్రిల్ 20) పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతడు అసభ్యకర రీతిలో సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ విరాట్ ఏం చేశాడంటే?
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కాస్త తడబడుతూనే ఆడుతోంది. మొదటి నాలుగు వికెట్లను స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. 4.2 ఓవర్ దగ్గర 42 పరుగులు వద్ద ప్రియాంశ్ ఆర్య రూపంలో తొలి వికెట్ కోల్పోయి పంజాబ్.. ఆ తర్వాత 62 పరుగులు వద్ద ప్రభ్ సిమ్రాన్ సింగ్, 68 పరుగులు వద్ద శ్రేయస్ అయ్యర్, 76 పరుగులు వద్ద నేహాల్ వధేరా వికెట్లను పోగొట్టుకుంది.

Virat Kohli: అయితే వీరిలో నేహాల్ వధేరా రనౌట్ గా వెనుదిరగడం ఆసక్తికరంగా జరిగింది. లేని రన్ కోసం అతడు పరుగెత్తి 8.6 ఓవర్ దగ్గర రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్ లో విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ భాగస్వామ్యమయ్యారు. దీంతో నేహాల్ రనౌట్ అవ్వగానే కోహ్లీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆ సమయంలో విరాట్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నేహాల్ వధేరా వికెట్ పడగానే.. కోహ్లీ అసభ్యకర రీతిలో సంబరాలు చేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా మార్క్ సెలెబ్రేషన్స్ స్ట్లైల్ లో అసభ్యకర రీతిలో సంజ్ఞలు చేశాడు కోహ్లీ. ఇది కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను గర్తుచేసుకంటున్నారు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ రేయ్ అమిత్ అంటూ చేసే సంజ్ఞ, యానిమల్ క్లైమాక్స్ లో రణ్‌బీర్ చేతితో చేసే సంజ్ఞ ఫొటోలను, కోహ్లీతో జత చేసి వైరల్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ.. సందీప్ రెడ్డి మార్క్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications