For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKSvsRCB:12 బంతుల్లోనే 40 రన్స్.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌కు కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్! వచ్చే మ్యాచుకు డౌటే?

PBKS vs RCB: Virat Kohli gives strong warning to Harshal Patel for poor bowling show at death
IPL 2021:Harshal Patel Poor Bowling కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్, వచ్చే మ్యాచుకు డౌటే?|Oneindia Telugu

అహ్మదాబాద్‌: శుక్రవారం నరేంద్ర మోడీ మైదానంలో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్.. 34 పరుగుల తేడాతో పటిష్ట రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది. బెంగళూరు ఓటమికి ఆ జట్టు పేసర్ హర్షల్ పటేలే ప్రధాన కారణం. బౌలర్లకు అనుకూలిస్తున్న అహ్మదాబాద్‌ పిచ్‌పై హర్షల్ తన చివరి రెండు ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 12 బంతుల్లో ఏకంగా 40 పరుగుల్ని సమర్పించుకున్నాడు. దాంతో ఒకానొక దశలో 150 స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన పంజాబ్.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (91 నాటౌట్‌; 57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటికి చివరికి 179 పరుగులు చేసింది.

4 ఓవర్లలో 53 పరుగులు

4 ఓవర్లలో 53 పరుగులు

ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 20వ ఓవర్ బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్.. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా దెబ్బకి ఒకే ఓవర్‌లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. 5 సిక్సర్లు, ఒక ఫోర్‌, రెండు పరుగులతో పాటు ఓ నోబాల్ కూడా వేశాడు హర్షల్. ఆ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. శుక్రవారం కింగ్స్‌పై కూడా అలానే బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన హర్షల్ 18 పరుగులు ఇచ్చాడు. 19వ ఓవర్ వేసిన సిరాజ్ 7 పరుగులే ఇచ్చి కింగ్స్‌ను కట్టడి చేశాడు. ఇక 20 ఓవర్ వేసిన హర్షల్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్‌ అయిన హర్షల్.. తన కోటా 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 53 పరుగులు ఇచ్చాడు.

పటేల్‌కి కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్

పటేల్‌కి కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్

మ్యాచులో హర్షల్ పటేల్ బౌలింగ్ చేస్తుంటే.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పదేపదే నిరాశకు గురయ్యాడు. బంతులు ఎలా వేయాలో కూడా అతడితో చర్చలు జరిపాడు. అయినా కూడా లాభంలేకపోయిది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పటేల్‌కి కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ కనిపించాడు. ఇలా పరుగులు ఇస్తే కష్టం అని హెచ్చరించాడు. హర్షల్ స్లాగ్ ఓవర్లలో ఎక్కువ పరుగులిచ్చిన రెండు మ్యాచుల్లో బెంగళూరు ఓడిపోయింది. చెన్నై మ్యాచ్‌లోనూ హర్షల్‌ని కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు. హర్షల్‌పై బెంగళూరు అభిమానులు గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'వచ్చే మ్యాచుకు నువ్ డౌటే', 'ఇన్ని పరుగులు ఇస్తుంటే.. హర్షల్ మనకు అవసరమా?', 'కోహ్లీ బయ్యా.. హర్షల్ గురించి ఓసారి ఆలోచించు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

బ్రార్‌ను ముందే సిద్ధం చేశాం..ఏదైతే అనుకున్నామో అదే చేశాడు!గేల్ కెరీర్‌లోనే ఇలా ఆడి ఉండకపోవచ్చు: రాహుల్

17 వికెట్లు పడగొట్టి

17 వికెట్లు పడగొట్టి

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'పంజాబ్‌ బాగా ఆడింది. మా ప్లాన్‌లు వర్కవుట్ అవలేదు. హర్షల్ పటేల్ చివర్లో ఎక్కువగా పరుగులిచ్చేశాడు. దాంతో 180 పరుగుల ఛేదన కష్టమైపోయింది. పంజాబ్ ఒకానొక దశలో 116/5తో నిలిచింది. ఈ సమయంలో చెత్త బంతులు విసిరి బౌండరీలు సమర్పించుకున్నాం. ఒకవేళ 160 పరుగులకే పంజాబ్‌ని కట్టడి చేసుంటే సులువుగా ఛేదించేవాళ్లం. ఓ దశలో 60 నుంచి 65 పరుగుల తేడాతో పరాజయం చెందుతామని అనుకున్నాం. అలా అయితే అది ఇంకా బాధించేది. హర్షల్‌-జెమీసన్‌లు బాగా ఆడారు. ఓటమి అంతరాన్ని తగ్గించారు' అని అన్నాడు. ఐపీఎల్ 2021లో 7 మ్యాచ్‌లాడిన హర్షల్ 17 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.

పంజాబ్ ఇన్నింగ్స్ ఊపందుకుంది అక్కడే

పంజాబ్ ఇన్నింగ్స్ ఊపందుకుంది అక్కడే

ఐపీఎల్ 2021 సీజన్ మినీ వేలంలో రూ.15 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీషన్‌‌ని యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్ (46: 24 బంతుల్లో 6x4, 2x6) ఓ ఆటాడుకున్నాడు. జెమీషన్‌‌ వేసిన ఇన్నింగ్స్ ఆరవ ఓవర్‌లో ఐదు బౌండరీలు (4,4,4,4,0,4) బాది 20 పరుగులు పిండుకున్నాడు. ఐదో బంతి కూడా బౌండరీ సాధించేవాడే. కానీ.. ఫీల్డర్ డైవ్ చేయడంతో అది సేవ్ అయ్యింది. అక్కడే పంజాబ్ ఇన్నింగ్స్ ఊపందుకుంది. ఒకవేళ జెమీషన్‌‌ బాగా బౌలింగ్ చేసుంటే.. పంజాబ్ భారీ స్కోర్ చేసేది కాదు.

Story first published: Saturday, May 1, 2021, 10:23 [IST]
Other articles published on May 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+