PBKS vs RCB: నేనైతే మస్తు అలసిపోయా.. ఆ క్యాచ్ వదిలేయడమే మా కొంప ముంచింది: డుప్లిసెస్


భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్ 88 పరుగులతో చెలరేగాడు. విరాట్ కోహ్లీ 41, దినేష్ కార్తీక్ 32 పరుగులతో రాణించారు.
అనంతరం లక్ష్యాన్ని పంజాబ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించింది. చివర్లో ఓడియన్ స్మిత్ విధ్వంసం సృష్టించగా.. అతనికి షారూక్ ఖాన్ కూడా సహకరించాడు. శిఖర్ ధావన్, రాజపక్స, మయాంక్ అగర్వాల్ కూడా బ్యాటింగ్‌లో రాణించారు. అయితే ఈ ఓటమిపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్ స్పందించాడు.

క్యాచ్ వదిలేయడం కొంపముంచింది
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో క్యాచ్‌లు వదిలేయం వల్లనే తమకు విజయం దూరమైందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్ అన్నాడు. డివై పాటిల్ మైదానం పిచ్ బ్యాటింగ్‌కు బాగుందన్న డుప్లిసెస్.. పంజాబ్ బ్యాటర్ ఓడియన్ స్మిత్ 8 బంతుల్లోనే 25 పరుగులు తమకు విజయాన్ని దూరం చేసినట్లు చెప్పుకొచ్చాడు.
అయితే అతడు 10 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశామని, అదే తమ కొంప ముంచిదని డుప్లిసెస్ చెప్పాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని పేర్కొన్నాడు. క్యాచ్‌లే మ్యాచ్ ఫిలతంలో కీలకపాత్ర పోషిస్తాయని అన్నాడు. కాగా క్యాచ్ వదిలేసిన అనంతరం మరింత చెలరేగిన ఓడియన్ స్మిత్ 8 బంతుల్లోనే 25 పరుగులు చేసిన పంజాబ్‌ను గెలపించాడు.

పిచ్ బౌలర్లకు సహకరించలేదు
మంచు కురవడంతో పిచ్ బౌలర్లకు సహకరించలేదని, ఇది బౌలర్లకు కఠిన రాత్రిగా పేర్కొన్నాడు. ఇక పంజాబ్ బ్యాటర్లు భారీ లక్ష్యాన్ని బాగా చేధించారని కొనియాడాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంతి కొంచెం స్కిడ్ అయిందని, తమ బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారని పేర్కొన్నాడు. ఓడియన్ స్మిత్ ఎలా ఆడతాడో అందరికీ తెలుసని, అతను అదే చేశాడని చెప్పాడు. షారూక్ ఖాన్ కూడా చివరి వరకు బాగా ఆడాడని అన్నాడు.

అలసి పోయాను
మ్యాచ్‌లో తాను ఆడిన 88 పరుగుల ఇన్నింగ్స్ పట్ల ఫాఫ్ డుప్లిసెస్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ఆ ఇన్నింగ్స్‌తో తాను అలసిపోయానని డుప్లిసెస్ నవ్వుతూ చెప్పాడు. బ్యాటింగ్ సమయంలో తాను గాయపడకుండా తప్పించుకున్నానని సంతోషంగా ఉందన్నాడు. నిజానికి మొదట బ్యాటింగ్ పిచ్ చాలా కఠినంగా ఉందని పేర్కొన్నాడు.
ఈ పిచ్‌పై బ్యాటింగ్ ప్రారంభించడం కష్టమని డుప్లిసెస్ చెప్పాడు. మొదటి 4 ఓవర్లు బంతి పూర్తిగా స్వింగ్ అయిందని తెలిపాడు. మొదటి 10 బంతులకు తాను ఒకే పరుగు చేశానని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో బ్యాట్ కొంచెం గట్టిగా పట్టుకుని పరుగులు చేసినట్లు డుప్లిసెస్ పేర్కొన్నాడు.

17 బంతుల్లోనే 71 పరుగులు
ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ను నిదానం ప్రారంభించిన డుప్లిసెస్ ఆ తర్వాత ఒక్క సారిగా గేర్ మార్చి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఎదుర్కొన్న మొదటి 30 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసిన డుప్లిసెస్.. ఆ తర్వాత ఎదుర్కొన్న 27 బంతుల్లోనే 71 పరుగులు బాదేశాడు. డుప్లిసెస్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లతోపాటు ఏకంగా 7 సిక్సులు ఉండడం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications