Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RCB Toss Update: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్‌.. బెంగ‌ళూరు బ్యాటింగ్‌

PBKS vs RCB: Punjab Kings Won The Toss And Elected To Bowl First

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ సీజ‌న్లో ఇరు జ‌ట్లు కూడా కొత్త కెప్టెన్ల‌తో బ‌రిలోకి దిగుతున్నాయి. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును ఫాఫ్ డుప్లిసెస్ న‌డిపించ‌నుండ‌గా.. పంజాబ్ కింగ్స్‌ను మ‌యాంగ్ అగ‌ర్వాల్ న‌డిపించ‌నున్నాడు.

ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్ప‌టివ‌ర‌కు 28 మ్యాచ్‌ల్లో త‌ల‌ప‌డ్డాయి.
ఇందులో 15 మ్యాచ్‌ల్లో పంజాబ్ గెల‌వ‌గా.. 13 మ్యాచ్‌ల్లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు గెలిచింది. కాగా ఐపీఎల్‌లో ఇరు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సారి కూడా ట్రోఫి గెల‌వ‌లేదు. బెంగ‌ళూరు 3 సార్లు, పంజాబ్ ఒక సారి ఫైన‌ల్ చేరిన‌ప్ప‌టికీ టైటిల్ అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో ఈ సారైనా టైటిల్ గెల‌వాల‌ని రెండు జ‌ట్లు క‌సిగా ఉన్నాయి.

తుది జ‌ట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌ ), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, భానుక రాజపక్స (వికెట్ కీప‌ర్‌), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, రాజ్ బావా, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, రాహుల్ చాహర్

Story first published: Sunday, March 27, 2022, 19:55 [IST]
Other articles published on Mar 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+