Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RCB: అందుకే మా‌క్స్‌వెల్‌‌పై వేటు- డుప్లెసిస్

ఐపీఎల్-2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ధర్మశాల వేదికా పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇరు జట్లకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిందే. ఈ పోరులో ఓడిన జట్టు ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన రెండో టీమ్‌గా నిలుస్తుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.

కాగా, ఈ సీజన్‌లో పంజాబ్, ఆర్సీబీ 11 మ్యాచ్‌లు ఆడగా, చెరో ఎనిమిది పాయింట్లు సాధించాయి. నెట్ రన్ రేటు మెరుగ్గా ఉంటంతో బెంగళూరు ఏడో స్థానంలో, పంజాబ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఓవరాల్‌లో ఐపీఎల్‌లో ఇప్పటివరకు పంజాబ్-బెంగళూరు 32 సార్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ 17 సార్లు, ఆర్సీబీ 15 సార్లు విజయం సాధించాయి.

PBKS vs RCB Maxwell out for Lockie Ferguson Faf du Plessis

పిచ్ ఎలా ఉంది?
పంజాబ్-సీఎస్కే మ్యాచ్‌లో వాడిన వికెట్‌నే ఈసారి కూడా వాడుతున్నారు. అయితే గత మ్యాచ్‌లో మోస్తారు స్కోర్లే నమోదయ్యాయి. కానీ ఆ ఆట మధ్యాహ్నం ప్రారంభమైంది. రాత్రి వేళలో సాగే మ్యాచ్‌ల్లో ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 195. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. అలాగే స్పిన్నర్లు ఈ వికెట్‌పై ప్రధాన పాత్ర పోషిస్తారు.

కాగా, టాస్ గెలిచిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొత్త బంతితో వికెట్లు సాధించి ఆర్సీబీ ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నామని కరన్ తెలిపాడు. గత మ్యాచ్‌లో ఇక్కడ ఛేజింగ్‌లో ఓడిపోయామని, అయితే ఛేదన పెద్ద విషయం కాదని మళ్లీ అదే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నాడు. రబాడ స్థానంలో లివింగ్‌స్టన్ వచ్చాడని చెప్పాడు.

మరోవైపు ఆర్సీబీ కెప్టెన్ మాక్స్‌వెల్ మాట్లాడుతూ.. పాయింట్స్ టేబుల్‌పై దృష్టి పెట్టట్లదని చెప్పాడు. సాధ్యమైనంత పోరాటం చేస్తామని అన్నాడు. గత మ్యాచ్‌ల్లో గొప్పగా రాణించామని తెలిపాడు. లాకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి తీసుకువస్తున్నామని, ఈ కారణంగా మాక్స్‌వెల్‌ను తప్పించామని డుప్లెసిస్ వివరించాడు.

తుదిజట్లు:
పంజాబ్ కింగ్స్: బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రొసో, శశాంక్ సింగ్, సామ్ కరన్ (కెప్టెన్), లివింగ్‌స్టోన్, అశుతోష్ శర్మ, విద్వాత్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పటిదార్, మహిపాల్ లోమ్రార్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, స్వప్పిల్ సింగ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్.

Story first published: Thursday, May 9, 2024, 19:17 [IST]
Other articles published on May 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+