Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS VS RCB: ఆఖర్లో అతనొక్కడే మెరుపులు - మిగతా బ్యాటర్లు తుస్సు..!

PBKS VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆర్సీబీ బౌల్లరు బాగా రాణించడంతో ... పంజాబ్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో స్కోరు చేయలేకపోయారు. దీంతో పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (15 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (17 బంతుల్లో 33; 5 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం చేసినా.. మిగతా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేక విఫలమయ్యారు.

జోష్‌ ఇంగ్లిస్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో శశాంక్ సింగ్ (31*), మార్కో యాన్సెన్ (25*) స్కోరు బోర్డును కాస్త ముందుకు తీసుకెళ్లారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. గత మూడు మ్యాచుల నుంచి రెండంకెల స్కోరు చేయలేకపోతున్నాడు. నేహల్ వధేరా (5), స్టాయినిస్‌ (1) కూడా నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో సుయాశ్‌ శర్మ 2, కృనాల్ పాండ్య 2, రొమారియో ఫెఫర్డ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

PBKS VS RCB IPL 2025 Royal Challengers Bengaluru target 158 runs against Punjab Kings in ipl 2025
]

ఇన్నింగ్స్ సాగిందిలా..
దూకుడుగా ఆడిన పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరు బౌండరీలు బాగా బాదారు. చెరో సిక్స్ కొట్టారు. దీంతో 4 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ 41/0 స్కోరుతో బలంగానే కనిపించింది. కానీ అప్పుడే దూకుడుగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్లకు కృనాల్ పాండ్య అడ్డుకట్ట వేశాడు. తన వరుస ఓవర్లలో ఇద్దరినీ పెవిలియన్‌కు పంపాడు. ఈ ఇద్దరు కూడా టిమ్‌ డేవిడ్‌కే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యారు.

కృనాల్ పాండ్య అద్భుతమైన క్యాచ్..
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను రొమారియో షెఫర్డ్ పెవిలియన్ పంపాడు. శ్రేయస్ భారీ షాట్ కు ప్రయత్నించగా.. కృనాల్ పాండ్య లాంగాన్‌ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి అదిరే క్యాచ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత నేహల్ వధేరా తొమ్మిదో ఓవర్‌లో రనౌగా వెనుదిరగాల్సి వచ్చింది. అప్పుడు జోష్ ఇంగ్లిస్, శశాంక్ స్కోరు బోర్డు కాస్త ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 37 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో సుయాశ్‌ శర్మ ఒకే ఓవర్లో జోష్‌ ఇంగ్లిస్, స్టాయినిస్‌ను పెవిలియన్ కు పంపాడు. దీంతో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యాన్సెన్‌తో కలిసి శశాంక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. దీంతో ఆఖరి ఆరు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ వికెట్‌ కోల్పోకుండానే 43 పరుగులు చేయగలిగింది.

Story first published: Sunday, April 20, 2025, 17:23 [IST]
Other articles published on Apr 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+