PBKS vs MI: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నేటి మ్యాచ్ రద్దు?
PBKS vs MI: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ధర్మశాల వేదికగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై వర్షం నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించగా.. పంజాబ్ కింగ్స్ తన ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యంత కీలకం. అయితే ప్రకృతి సహకరిస్తేనే ఈ ఉత్కంఠ పోరు సాధ్యమవుతుందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఈ పోరు జరగాల్సి ఉంది.
ధర్మశాల వాతావరణ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. ఆక్యువెదర్ రిపోర్టు ప్రకారం.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వర్షం పడే అవకాశం 40 నుంచి 60 శాతంగా ఉంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. పగటిపూట కురిసే భారీ వర్షం కారణంగా మైదానం తడిగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ 6-7 గంటల పాటు నిరంతరంగా వర్షం కురిస్తే స్టేడియాన్ని సిద్ధం చేయడం అంపైర్లకు, గ్రౌండ్ స్టాఫ్‌కు సవాలుగా మారుతుంది.

ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు ఇది పెద్దగా కలిసిరాదు. వారు ప్లేఆఫ్ రేసులో బలంగా నిలవాలంటే ఖచ్చితంగా 2 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ముంబై ఇండియన్స్ పరువు కోసం ఆడుతుండగా.. పంజాబ్ మాత్రం చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. అందుకే వాతావరణం అనుకూలించి మ్యాచ్ పూర్తి స్థాయిలో జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక జట్ల విషయానికి వస్తే, పంజాబ్ కింగ్స్ జట్టులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మార్కస్ స్టోయినిస్, యుజ్వేంద్ర చాహల్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మరి వర్షం 'విలన్'గా మారుతుందో లేక అభిమానులకు వినోదాన్ని అందిస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications