Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs MI: సచిన్ కొడుకు కోసం అతనిపై వేటు..పంజాబ్‌పై తుది జట్టు ఇదే!

ఐపీఎల్-2024 సీజన్‌లో ఫస్ట్ హాఫ్ ముగిసే టైమ్ వచ్చేసింది. మరో మూడు రోజుల్లో అన్ని జట్లు తమ సగం మ్యాచ్‌లను పూర్తిచేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాయింట్స్ టేబుల్‌లో తమ ర్యాంక్‌ను మెరుగుపర్చుకోవాలని కసిగా బరిలోకి దిగుతున్నాయి. కేవలం గెలుపే లక్ష్యంగా కాకుండా నెట్ రన్‌ రేట్ పెరిగేలా, భారీ విజయాలు సాధించాలే ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఈ క్రమంలో ముల్లాన్‌పూర్ వేదికగా రేపు జరగనున్న పంజాబ్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై అంచనాలు పెరిగాయి. రేపటి మ్యాచ్‌లో బలమైన ముంబై జట్టే ఫేవరేట్ అయినప్పటికీ సొంతమైదానంలో పంజాబ్‌ను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి. అయితే ఈ సీజన్‌లో ఆలస్యంగా గెలుపు బాట పట్టిన ముంబై సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంంది. ఆరు మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ సేన కేవలం రెండు విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

PBKS vs MI Akash Madhwal s Spot Likely to Be Taken Over by Arjun Tendulkar Mumbai Indians Predicted Playing XI

పంజాబ్ కింగ్స్‌పై గెలిచి సీజన్ అర్ధభాగం ముగిసే సమయానికి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ నిలకడగా పరుగులు సాధించకపోవడం ముంబైను కలవరపెడుతోంది. ఒక్క అర్ధశతకం సాధించి రెండు సార్లు డకౌటయ్యాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా అంచనాలు అందుకోలేకపోతున్నాడు. బంతి, బ్యాటుతో విఫలమవుతున్నాడు.

మ్యాచ్ విన్నర్లు అయిన ఈ స్టార్ ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించలేని పరిస్థితి. దీంతో సూర్య, హార్దిక్ వైఫల్యాన్ని టీ‌మ్‌పై ప్రభావంపై పడకుండా జట్టుకూర్పు ఉండేలా ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో అట్టర్ ఫ్లాప్ అయిన బౌలర్ ఆకాశ్ మద్వాల్‌ను తప్పించాలని భావిస్తోంది. అతడి స్థానంలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటుంది. అయితే ఆకాశ్ తరహాలోనే అర్జున్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించే ఛాన్స్ ఉంది. ఎడమచేతి వాటం ప్లేయర్ అయిన అర్జున్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటగలడు.

ముంబై ఇండియన్స్ తుదిజట్టు (అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియా షెఫార్డ్, శ్రేయస్ గోపాల్, కొయెట్జీ, జస్‌ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ ప్లేయర్: అర్జున్ టెండూల్కర్

Story first published: Wednesday, April 17, 2024, 17:15 [IST]
Other articles published on Apr 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+