Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs LSG: ప్లేఆఫ్స్ బెర్తులపై గురిపెట్టిన జట్లకు చావోరేవో.. గెలిచేదెవరు?

PBKS vs LSG: ఐపీఎల్ 2025లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి ఇరు జట్లు ఈ మ్యాచ్ చాలా కీలకం. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ సేనలు విజయంపై కన్నేశాయి.

రిషబ్ పంత్ ఏ చెప్పాడంటే?
టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేస్తామని ఎంచుకున్నట్లు రిషబ్ పంత్ చెప్పాడు. ఈ పిచ్ పై బంతి కొంచెం ఆగి వస్తుందని.. ఇది మంచి మ్యాచ్ అవుతుందన్నాడు. ముందుగా బౌలింగ్ చేయడం వల్ల మాకు ఒక ప్రయోజనం లభిస్తుందని.. ఆట ఎలా ముందుకు సాగుతుందో చూడవచ్చన్నాడు.

PBKS vs LSG IPL 2025 Crucial Clash for Playoff Spot Who Will Win Today

శ్రేయస్ అయ్యర్ ఏం చెప్పాడు?
టాస్ ఓడిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. తాము కూడా ముందుగా బౌలింగ్ చేయగలిగేవారమని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. వికెట్ ఎలా ఉంటుందో తాను అంచనా వేయాలనుకోవడం లేదన్నాడు. తాము పోటీకి సిద్ధంగా ఉన్నామన్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్: రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మర్క్రమ్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, ఆకాష్ సింగ్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఉమర్‌జాయ్, మార్కో జాన్సన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Sunday, May 4, 2025, 19:38 [IST]
Other articles published on May 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+