Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన ధోనీ..ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ కీలక పోరులో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే ముందంజలో నిలిచింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది.

రవీంద్ర జడేజా (46; 26 బంతుల్లో, 3x4, 2x6) టాప్ స్కోరర్. రుతురాజ్ గైక్వాడ్ (32; 21 బంతుల్లో, 4x4, 1x6), డారిల్ మిచెల్ (30; 19 బంతుల్లో, 2x4, 1x6) కీలక పరుగులు సాధించారు. శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.

PBKS vs CSK MS Dhoni Makes History First Wicketkeeper to Complete 150 Catches in IPL

అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (30; 23 బంతుల్లో, 2x4, 2x6), శశాంక్ సింగ్ (27; 20 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్లు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా (3/20) మూడు, సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్‌పాండే (2/35) చెరో రెండు వికెట్లు తీశారు.

అయితే ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. జితేశ్ శర్మ ఇచ్చిన క్యాచ్ అందుకున్న ధోనీ ఘనత అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 150 క్యాచ్‌లను అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. లీగ్‌లో ధోనీ 150 క్యాచ్‌లతో పాటు 42 స్టంపింగ్స్ చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు, స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్ల జాబితాలో ధోనీ తర్వాతి స్థానంలో దినేశ్ కార్తీక్ ఉన్నాడు.

దినేశ్ కార్తీక్ 141 క్యాచ్‌లు, 36 స్టంపింగ్స్ చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో వృద్ధిమాన్ సాహా (141 క్యాచ్‌లు, 36 స్టంపింగ్స్), రిషభ్ పంత్ (75 క్యాచ్‌లు, 21 స్టంపింగ్స్), రాబిన్ ఉతప్ప (57 క్యాచ్‌లు, 33 స్టంపింగ్స్) ఉన్నారు.

Story first published: Sunday, May 5, 2024, 19:29 [IST]
Other articles published on May 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+