Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ వల్ల సీఎస్కేకు ఉపయోగం ఏంటి?- ఇర్ఫాన్ పఠాన్

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై చర్చ జోరుగా సాగుతోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆలస్యంగా ధోనీ బరిలోకి దిగడంపై మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇది సీఎస్కే జట్టుపై తీవ్ర ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు.

ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై సీఎస్కే 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది. అయితే 16 ఓవర్లకే సీఎస్కే 122 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ ధోనీ తొమ్మిదో స్థానంలో 19వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. తొలి బంతికే డకౌటయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన స్లో డెలివరీకీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

PBKS vs CSK MS Dhoni batting at No 9 doesn t help for CSK- Irfan Pathan

అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేయడంతో సీఎస్కే విజయం సాధించింది. అయితే ధోనీ కాస్త ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే చెన్నై మెరుగైన స్కోరు సాధించేదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. తొమ్మిదో స్థానంలో ధోనీ బ్యాటింగ్‌కు రావడం వల్ల సీఎస్కేకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నాడు. ధోనీ బాధ్యత తీసుకుని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాల్సిందని అన్నాడు. శార్దూల్ ఠాకూర్ తర్వాత మహీ బ్యాటింగ్‌కు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

''తొమ్మిదో స్థానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ రావడం వల్ల సీఎస్కే‌కు ఉపయోగం ఉండదు. ఆ ప్రణాళికతో ఎలాంటి లాభం ఉండదు. అతను వయసు 42 ఏళ్లు. కానీ ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి. అతను కనీసం నాలుగు నుంచి అయిదు ఓవర్లు అయినా బ్యాటింగ్ చేయాల్సింది''

''ధోనీ ఆఖరి ఓవర్ లేదా చివరి రెండు ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇది సీఎస్కేకు ఎక్కువ కాలం ప్రయోజనం చేకూరదు. ఫామ్‌లో ఉన్న సీనియర్ ప్లేయర్‌గా అతను బ్యాటింగ్‌కు మరింత ముందుకు రావాలి. గతంలో వచ్చినట్లుగా ఆఖర్లో రాకూడదు. అయితే ఇటీవల ముంబై ఇండియన్స్‌పై ధోనీ ఆఖర్లో వచ్చి ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడాడు''

''కానీ పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో జట్టుకు అతని అవసరం ఉంది. అతని కంటే ముందు శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ధోనీని తొమ్మిదో స్థానంలో మనం చూడలేం. సమీర్ రిజ్వీ 15వ ఓవర్‌లోనే ప్యాడ్స్ కట్టుకుని బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉన్నాడు. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఆలోచించాలి. నాలుగు ఓవర్ల పాటు బ్యాటింగ్‌ ఆడమని ధోనీకి ఎవరైనా చెప్పాలి'' అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.

Story first published: Monday, May 6, 2024, 12:56 [IST]
Other articles published on May 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+